Telugu Global
Cinema & Entertainment

సినిమా కోసం క్రికెట్ ఆడుతున్న మహేష్ బాబు?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా “మహర్షి” తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో మహేష్ బాబు బిజినెస్ మాన్ గా కనిపించబోతున్నాడు. ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమా లో మహేష్ బాబు క్రికెట్ ఆడే సీన్ ఒకటి ఉండబోతుందన్న వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో దాదాపు పది నిమిషాల పాటు మహష్ బాబు క్రికెటర్ పాత్రలో కనిపిస్తాడట. ఫస్ట్ హాఫ్ లో ఈ సీన్ […]

సినిమా కోసం క్రికెట్ ఆడుతున్న మహేష్ బాబు?
X

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమాగా “మహర్షి” తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో మహేష్ బాబు బిజినెస్ మాన్ గా కనిపించబోతున్నాడు.

ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమా లో మహేష్ బాబు క్రికెట్ ఆడే సీన్ ఒకటి ఉండబోతుందన్న వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో దాదాపు పది నిమిషాల పాటు మహష్ బాబు క్రికెటర్ పాత్రలో కనిపిస్తాడట. ఫస్ట్ హాఫ్ లో ఈ సీన్ సినిమాకి హై లైట్ గా నిలుస్తుందని టాక్.

మరి కెరీర్ లో మొదటి సారి బ్యాట్ పట్టిన మహేష్ బాబు…. క్రికెటర్ స్టిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రికెట్ సీక్వెన్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నిప్పుతుందని మూవీ యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

అల్లరి నరేష్…. మహేష్ బాబు స్నేహితుడిగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  31 Jan 2019 12:11 AM GMT
Next Story