Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూనే….  బిజినెస్ లో కి కూడా అడుగుపెట్టాడు. ఏ.ఎం.బి సినిమాస్ ని నిర్మించి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు ఈ స్టార్ హీరో ఒక వెబ్ సిరీస్ ని నిర్మించే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు నిర్మించే ఫస్ట్ వెబ్ సిరీస్ పేరు “చార్లీ”. “నాన్నకు ప్రేమతో” సినిమాకి కథ అందించిన హుస్సేన్ షా కిరణ్ ఈ వెబ్ సిరీస్ […]

మహేష్ బాబు థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తుంది
X

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూనే…. బిజినెస్ లో కి కూడా అడుగుపెట్టాడు. ఏ.ఎం.బి సినిమాస్ ని నిర్మించి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు మహేష్ బాబు.

ఇక ఇప్పుడు ఈ స్టార్ హీరో ఒక వెబ్ సిరీస్ ని నిర్మించే పనిలో ఉన్నాడు. మహేష్ బాబు నిర్మించే ఫస్ట్ వెబ్ సిరీస్ పేరు “చార్లీ”. “నాన్నకు ప్రేమతో” సినిమాకి కథ అందించిన హుస్సేన్ షా కిరణ్ ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

పూర్తి స్థాయి థ్రిల్లర్ నేపధ్యంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ మొత్తం మూడు సీసన్స్ గా రానుంది. ఒక్కో సీసన్ కి ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపు గంట.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ పూర్తి నిర్మాణ బాధ్యత మాత్రం మహేష్ బాబు భార్య నమ్రత చూసుకుంటుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

First Published:  31 Jan 2019 4:02 AM GMT
Next Story