Telugu Global
National

రాజస్థాన్‌ అసెంబ్లీ.... కాంగ్రెస్‌కు, హర్యాణా అసెంబ్లీ.... బీజేపీకి

ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకు గాను 99 అసెంబ్లీ సీట్లను గెలుకుకొని అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే విజయం లభించింది. గత ఎన్నికల సమయంలో పోలింగ్ జరగని రామ్‌ఘర్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షఫియా జుబేర్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సుఖ్‌వంత్ సింగ్‌పై 12,228 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రామ్‌ఘర్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 100కు చేరుకుంది. ఇతర […]

రాజస్థాన్‌ అసెంబ్లీ.... కాంగ్రెస్‌కు, హర్యాణా అసెంబ్లీ.... బీజేపీకి
X

ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకు గాను 99 అసెంబ్లీ సీట్లను గెలుకుకొని అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే విజయం లభించింది. గత ఎన్నికల సమయంలో పోలింగ్ జరగని రామ్‌ఘర్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షఫియా జుబేర్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సుఖ్‌వంత్ సింగ్‌పై 12,228 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రామ్‌ఘర్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 100కు చేరుకుంది. ఇతర చిన్న పార్టీల సహాయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌కు ఈ విజయం ఎంతో ఊరటనిచ్చే అంశం. ఈ గెలుపుపై సీఎం అశోక్ గెహ్లోత్ మాట్లాడుతూ…. ప్రజలు తెలివైన, సరైన నిర్ణయం తీసుకున్నారని…. వారికి మా ధన్యవాదాలని తెలిపారు. ఈ విజయంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాల కోసం పోరాడతామన్నారు.

ఇక హర్యాణాలోని జింద్ శాసనసభ్యుడిగా ఉన్న ఐఎన్ఎల్డీ నేత హరిచంద్ మిధా మరణంతో బైపోల్ నిర్వహించారు. ఈ రోజు జరిపిన కౌంటింగ్‌లో ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి కృష్ణ మిధా తన సమీప జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ చౌతాలపై 10వేల ఓట్ల మెజార్టీ సాధించి విజయం వైపు దూసుకొని పోతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జీవాలా మూడో స్థానంలో నిలిచారు. తుది ఫలితం అందాల్సి ఉంది.

First Published:  31 Jan 2019 4:36 AM GMT
Next Story