Telugu Global
NEWS

బాబుది భయమా? ఆగ్రహమా?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శాసనసభలో ఊగిపోయారు. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిని ఉద్దేశించి రెచ్చిపోయారు. ఏం తమాషాగా ఉందా అంటూ చూపుడు వేలు చూపిస్తూ…. కళ్లెర్రజేస్తూ హెచ్చరికలు వంటివి జారీ చేశారు. నన్ను జైలుకు పంపిస్తారా? అంటూ మండిపడ్డారు. దీని వెనుక ఆయన అసహనం దాగి ఉందా? లేక ఆయన భయం దాగి ఉందా? ఆగ్రహం దాగి ఉందా? అని చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు తీవ్రంగా […]

బాబుది భయమా? ఆగ్రహమా?
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శాసనసభలో ఊగిపోయారు. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిని ఉద్దేశించి రెచ్చిపోయారు. ఏం తమాషాగా ఉందా అంటూ చూపుడు వేలు చూపిస్తూ…. కళ్లెర్రజేస్తూ హెచ్చరికలు వంటివి జారీ చేశారు. నన్ను జైలుకు పంపిస్తారా? అంటూ మండిపడ్డారు. దీని వెనుక ఆయన అసహనం దాగి ఉందా? లేక ఆయన భయం దాగి ఉందా? ఆగ్రహం దాగి ఉందా? అని చర్చ జరుగుతోంది.

చంద్రబాబు నాయుడు తీవ్రంగా కలత చెందితేనో, లోలోపల భయం గా ఉంటేనో, తెలియని ఆందోళనతో సతమతమవుతుంటేనో మాత్రమే ఇలా ఉంటారని ఆయనకు బాగా తెలిసిన వాళ్ళు చెబుతున్నారు. శుక్రవారం నాటి సభలో నారా చంద్రబాబునాయుడు ప్రవర్తన ఈ మూడింటిలో ఏదో ఒక దానికి సంకేతం అని చెబుతున్నారు.

గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ అధిష్టానం పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైనా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రతి అంశంలోనూ తనను ఇరికించడానికి చూస్తున్నారని భ్రమలో గడుపుతున్నారు. ఇరువురి మధ్య స్నేహం ఉన్నప్పుడు జరిగిన అనేక అంశాలను ఒక్కొక్కటిగా నేడు బయట పెడుతున్నారు. ఇది రాజకీయ పార్టీల పరంగా గానీ, ప్రభుత్వాల పరంగా కానీ మంచిది కాదని అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

విశ్వహిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఆంధ్రప్రదేశ్ లో కి రాగానే ఆయనను అరెస్టు చేయాలంటూ ఆదేశించారని, ఇది ఏం పద్ధతంటూ ఏనాడో జరిగిన సంఘటనను బయటపెడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టడానికేనని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎవరితో కలిసి ఉన్నా విడిపోయినా ఏనాడూ ఏ రహస్యాన్నీ బయట పెట్టలేదు. ఇప్పుడు మాత్రం ప్రవీణ్ తొగాడియా విషయం ప్రపంచానికి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని రోడ్డున పడేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోందంటున్నారు.

శుక్రవారం నాడు శాసనసభలో చంద్రబాబు ఆవేశం, ప్రవీణ్‌ తొగాడియా అరెస్టు విషయం వెల్లడించడం వంటివి, నన్ను జైలుకు పంపిస్తారా? అనడం చంద్రబాబులోని అసహనం వంటివి తెలియజేస్తున్నాయని అంటున్నారు. అలా కాని పక్షంలో ఈ ప్రవర్తన ఆయనలో గూడు కట్టుకున్న భయాన్ని బహిర్గత పరుస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

First Published:  1 Feb 2019 10:00 AM GMT
Next Story