Telugu Global
NEWS

పళ్లు కొరకడం తప్ప.... ఏమీ చేయలేని నిస్సహాయత

ఏపీ కేబినెట్‌లో అత్యధిక అవమానాలు ఎదుర్కొన్న మంత్రి ఎవరు అంటే తక్షణం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేరు చెబుతున్నారు టీడీపీ నేతలు. రెవెన్యూ శాఖ మంత్రి అయినప్పటికీ అమరావతి భూముల వ్యవహారంలో ఆయన్ను అడుగుపెట్టనివ్వలేదు చంద్రబాబు. మంత్రి నారాయణతో కలిసి వేల ఎకరాల వ్యవహారాలను చక్కపెట్టేశారు సీఎం. జెండా ఆవిష్కరణ విషయాల్లోనూ కేఈని పలుమార్లు అవమానించారు. రెవెన్యూ శాఖలో చిన్న అధికారి బదిలీ కూడా చేసుకోలేని పరిస్థితి కేఈది. దేవాదాయ శాఖ చేపటితే ఆ తర్వాత […]

పళ్లు కొరకడం తప్ప.... ఏమీ చేయలేని నిస్సహాయత
X

ఏపీ కేబినెట్‌లో అత్యధిక అవమానాలు ఎదుర్కొన్న మంత్రి ఎవరు అంటే తక్షణం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేరు చెబుతున్నారు టీడీపీ నేతలు. రెవెన్యూ శాఖ మంత్రి అయినప్పటికీ అమరావతి భూముల వ్యవహారంలో ఆయన్ను అడుగుపెట్టనివ్వలేదు చంద్రబాబు.

మంత్రి నారాయణతో కలిసి వేల ఎకరాల వ్యవహారాలను చక్కపెట్టేశారు సీఎం. జెండా ఆవిష్కరణ విషయాల్లోనూ కేఈని పలుమార్లు అవమానించారు. రెవెన్యూ శాఖలో చిన్న అధికారి బదిలీ కూడా చేసుకోలేని పరిస్థితి కేఈది.

దేవాదాయ శాఖ చేపటితే ఆ తర్వాత రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందన్న భయం ఉంది. దాంతో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు … బీజేపీ- టీడీపీ మధ్య గ్యాప్‌ కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో దేవాదాయ శాఖ తీసుకునేందుకు ఏ మంత్రీ ముందుకు రాలేదు. దాంతో దాన్ని కేఈకి అంటగట్టారు చంద్రబాబు. ఇలా చాలా విషయాలలో తనను తక్కువ చేస్తున్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి కేఈది.

వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడిగా కుమారుడు శ్యాంబాబు ఉండడం వల్ల కూడా కేఈ తన అవమానాలపై ప్రశ్నించలేకపోతున్నాడని చెబుతున్నారు. తాజాగా కేఈ అవమానాలకు పరాకాష్ట అన్నట్టుగా అమరావతిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కేఈని కనీసం ఆహ్వానించలేదు. ఆయన లేకుండానే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కూడా కేఈ గురించి ఆరా తీయలేదు.

జయహో బీసీ అంటూ ఓవైపు ప్రచారం చేస్తున్న చంద్రబాబు… ఒక సీనియర్ బీసీ మంత్రిని ఇలా అమానించడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై తనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద కేఈ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దేవాదాయ శాఖ తనకు ఎందుకు అని ప్రశ్నించారు.

శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డు నియామక ఫైల్‌ను 3 నెలల క్రితం సీఎం వద్దకు పంపానని… కానీ ఆమోదించలేదన్నారు. ఈ శాఖను వదులుకోవాలని కూడా తనకు అనిపిస్తోందని ఆవేదన చెందారు.

First Published:  31 Jan 2019 10:05 PM GMT
Next Story