నాగార్జున సరసన పాయల్ రాజ్ పుత్

“RX 100” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు యువత గుండెల్లో హాట్ హీరోయిన్ అనే ముద్రని వేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా హిట్ తరువాత పాయల్ రాజ్ పుత్ కి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. 

పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం రవితేజ తదుపరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. “డిస్కో రాజా” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమాని వి.ఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే మరో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

ప్రస్తుతం అక్కినేని నాగార్జున తన తదుపరి సినిమాగా “మన్మధుడు 2” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.

అయితే క్రేజీ సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా తీసుకున్నారట మూవీ యూనిట్. అయితే అన్నపూర్ణ ప్రొడక్షన్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.