Telugu Global
Cinema & Entertainment

మార్చి నుంచి శర్వానంద్, సమంతా....

శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయే సమయానకి…. శర్వానంద్ తన తదుపరి సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. శర్వానంద్ తన తదుపరి సినిమా గా తమిళ సినిమా అయిన “96” ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన […]

మార్చి నుంచి శర్వానంద్, సమంతా....
X

శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయే సమయానకి…. శర్వానంద్ తన తదుపరి సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. శర్వానంద్ తన తదుపరి సినిమా గా తమిళ సినిమా అయిన “96” ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ లో అక్కినేని సమంతా హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మార్చి నుండి మొదలవనుంది. సినిమా చిత్రీకరణ వైజాగ్ లో జరగనున్నట్లు సమాచారం.

షూటింగ్ త్వరగా పూర్తి చేసి ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

First Published:  1 Feb 2019 3:18 AM GMT
Next Story