Telugu Global
National

బడ్జెట్లో మెరుపులు ఇవే....

కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితిని భారీగా పెంచింది. ఐదు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఐదు లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిసి రూ. 6.5లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 40వేల నుంచి 50వేలకు పెంచారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పీయూష్‌ గోయల్… నాలున్నరేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. బడ్జెట్‌లో గోయల్‌ ప్రసంగంలో హైలైట్స్…. […]

బడ్జెట్లో మెరుపులు ఇవే....
X

కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితిని భారీగా పెంచింది. ఐదు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఐదు లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

పొదుపు, పెట్టుబడులతో కలిసి రూ. 6.5లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 40వేల నుంచి 50వేలకు పెంచారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పీయూష్‌ గోయల్… నాలున్నరేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు.

బడ్జెట్‌లో గోయల్‌ ప్రసంగంలో హైలైట్స్….

– పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలతో…. లక్ష కోట్లకు పైగా సొమ్ము ఖాతాల్లోకి వచ్చింది
– 2017-18లో కోటి 6లక్షల మంది ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు
– ప్రస్తుతం నెలకు పన్నుల వసూలు మొత్తం రూ. 97వేల 100 కోట్లు
– గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సరాసరి 14 శాతం పెరిగాయి
– రైల్వేల చరిత్రలో ఇది అతి తక్కువ ప్రమాదాలు జరిగిన ఏడాది
– బ్రాడ్‌ గేజ్‌లో కాపల లేని గేట్లను తొలగించాం
– ఉపాధి హామీకి రూ.60వేల కోట్లు కేటాయింపు
– ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు మొబైల్ డేటా, వాయిస్‌ కాల్స్ ఇస్తున్నాం
– ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ నుంచి మినహాయింపుపై త్వరలో నిర్ణయం
– మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ఉంచాలని నిర్ణయం

– రక్షణ రంగానికి మూడు లక్షల కోట్లు కేటాయింపు
– దేశ భద్రతలో రాజీ లేదు. అవసరమైతే మరిన్ని నిధులు మళ్లిస్తాం
– ప్రధాన మంత్రి కౌసల్‌ యోజన ద్వారా కోటి మంది యువతకు శిక్షణ
-ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోచన పథకం ద్వారా 6 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్‌
– రైల్వే రంగానికి బడ్జెటరీ సపోర్ట్ కింద రూ. 64, 587 కోట్లు
-మిజోరం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం
– దేశంలో 268 వరకు మొబైల్ పరిశ్రలు ఏర్పాటు చేశాం
– వచ్చే ఐదేళ్లలో లక్ష డిజిటల్ గ్రామాల ఏర్పాటు లక్ష్యం
– సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు

First Published:  1 Feb 2019 2:12 AM GMT
Next Story