Telugu Global
National

చెన్నై ఎయిర్‌పోర్టులో చిరుత పిల్లకు పాలు పడుతున్న సిబ్బంది.. ఎందుకో తెలుసా..?

చెన్నై ఎయిర్‌పోర్టులో ఇవాళ ఒక అరుదైన దృశ్యాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా జూలోనో, అడవిలోనో కనిపించే చిరుతపులి పిల్ల విమానాశ్రయ సిబ్బంది ఒడిలో పడుకొని పాలుతాగుతోంది. ఆ చిన్నారి కూన ఎందుకు అక్కడ ఉందో తెలుసుకొని ప్రయాణికులు అవాక్కయ్యారు. విషయం ఏంటంటే.. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా బ్లాంకెట్‌లో చుట్టి పెట్టిన చిరుతపులి పిల్ల కనపడింది. వెంటనే అతడిని చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు బంధించి పోలీసులకు అప్పగించారు. […]

చెన్నై ఎయిర్‌పోర్టులో చిరుత పిల్లకు పాలు పడుతున్న సిబ్బంది.. ఎందుకో తెలుసా..?
X

చెన్నై ఎయిర్‌పోర్టులో ఇవాళ ఒక అరుదైన దృశ్యాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా జూలోనో, అడవిలోనో కనిపించే చిరుతపులి పిల్ల విమానాశ్రయ సిబ్బంది ఒడిలో పడుకొని పాలుతాగుతోంది. ఆ చిన్నారి కూన ఎందుకు అక్కడ ఉందో తెలుసుకొని ప్రయాణికులు అవాక్కయ్యారు. విషయం ఏంటంటే..

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా బ్లాంకెట్‌లో చుట్టి పెట్టిన చిరుతపులి పిల్ల కనపడింది. వెంటనే అతడిని చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు బంధించి పోలీసులకు అప్పగించారు. పులి పిల్లను పెంచుకోవడానికి తెచ్చినట్లు అతను చెప్పాడు.

చాలా సేపు బ్లాంకెట్‌లో చుట్టి బ్యాగులో ఉంచడంతో ఆ పులి పిల్ల నీరసంగా మారింది. వెంటనే ఒక బాటిల్‌లో పాలు నింపి విమానాశ్రయ సిబ్బంది దానికి తాగిపించారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ చిరుత పులి పిల్లను అటవీ శాఖ అధికారులకు అప్పగించగా వారు దాన్ని చెన్నై ఎయిర్‌పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలోని అన్నా జూలాజికల్ పార్కుకు తరలించారు.

First Published:  2 Feb 2019 7:58 AM GMT
Next Story