Telugu Global
National

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రిషి కుమార్ శుక్లా

కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన సంచాలకునిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లాను నియమిస్తూ మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా ఉన్న ఆయనను సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమించారు. గత రెండు నెలలుగా సీబీఐలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. సీబీఐ ఛీఫ్ అలోక్ వర్మపై మరో అధికారి రాకేష్ ఆస్థానా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో వారిద్దరినీ తొలగించిన కేంద్రం నాగేశ్వర రావును తాత్కాలిక డైరెక్టర్‌గా […]

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రిషి కుమార్ శుక్లా
X

కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన సంచాలకునిగా సీనియర్ ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లాను నియమిస్తూ మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా ఉన్న ఆయనను సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమించారు.

గత రెండు నెలలుగా సీబీఐలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. సీబీఐ ఛీఫ్ అలోక్ వర్మపై మరో అధికారి రాకేష్ ఆస్థానా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో వారిద్దరినీ తొలగించిన కేంద్రం నాగేశ్వర రావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది.

ఆ తర్వాత అలోక్ వర్మ సుప్రీంకోర్టుకు వెళ్లి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. తిరిగి ఆయన డైరెక్టర్ అయినా… ఒక్క రోజులోనే ఆయనను వేరే శాఖకు బదిలీ చేయడంతో అలిగి ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర రావుపై కూడా సుప్రీంలో కేసు వేశారు. సుప్రీంకోర్టు సీబీఐకి పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని తీర్పు చెప్పింది.

ఈ నేపథ్యంలో మోడీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం…. సీజేఐ రంజన్ గొగాయ్, కాంగ్రెస్ నేత ఖర్గే లతో కూడిన కమిటీ రిషికుమార్ శుక్లాను కొత్త డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.

First Published:  2 Feb 2019 6:37 AM GMT
Next Story