అమ్మాయిని ప్రేమలోకి దింపిన బండి హరి…. ఫోక్సో చట్టం ప్రయోగం

విజయవాడ పడమట పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ నిర్వాకం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి హరి… ప్రేమ పేరుతో ఒక బాలికను ముగ్గులోకి దింపాడు. అమ్మాయిని తీసుకుని పారిపోయాడు.

బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆరా తీయగా కానిస్టేబుల్‌ హరినే బాలికను తీసుకెళ్లినట్టు గుర్తించారు. ప్రేమ పేరుతో బాలికను తీసుకెళ్లినట్టు తేల్చారు.

కానిస్టేబుల్ హరి ప్రస్తుతం అనంతపురంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీంను రంగంలోకి దింపారు. బాలికను కానిస్టేబుల్‌ తీసుకెళ్లిన నేపథ్యంలో అతడిపై ఫోక్సో చట్టాన్ని పోలీసులు ప్రయోగించారు. ఫోక్సో చట్టం కింద బండి హరిపై కేసు నమోదు చేశారు. అతనిని విధుల నుంచి తొలగించారు.