Telugu Global
National

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో.... ఇక కొన్ని కొనుగోలు చేయలేం..!

మనం ఒక బట్టల షాపుకు వెళ్తాం.. అక్కడ మనకు నచ్చిన దుస్తుల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయ్.. సర్లే పక్క షాపులో కొందాం అనుకొని బయటకు వస్తుంటే.. అక్కడే ఉండే ఒక ఎగ్జిక్యూటీవ్ మన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తాడు. ”సార్ మీరు చూసింది బ్రాండెడ్.. కాని అదే క్వాలిటీతో సేమ్ ప్రొడక్ట్ ఉంటుంది ఒక సారి చూడండి.” ఇలాంటి బేరం చేసే వాళ్లు ప్రతీ షాపులోనూ.. ప్రతీ మాల్‌లోనూ కనపడతారు. వాళ్లు మనకు ఎదురుగా […]

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో.... ఇక కొన్ని కొనుగోలు చేయలేం..!
X

మనం ఒక బట్టల షాపుకు వెళ్తాం.. అక్కడ మనకు నచ్చిన దుస్తుల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయ్.. సర్లే పక్క షాపులో కొందాం అనుకొని బయటకు వస్తుంటే.. అక్కడే ఉండే ఒక ఎగ్జిక్యూటీవ్ మన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తాడు. ”సార్ మీరు చూసింది బ్రాండెడ్.. కాని అదే క్వాలిటీతో సేమ్ ప్రొడక్ట్ ఉంటుంది ఒక సారి చూడండి.”

ఇలాంటి బేరం చేసే వాళ్లు ప్రతీ షాపులోనూ.. ప్రతీ మాల్‌లోనూ కనపడతారు. వాళ్లు మనకు ఎదురుగా నిలబడి మాట్లాడతారు కాబట్టి రేపు ఏమైనా తేడా వస్తే అదే షాపుకు వెళ్లి ఎదిరించే అవకాశం ఉంటుంది.

మరి ఆన్‌లైన్ షాపింగ్…. అదే ఈ కామర్స్ సైట్లలో మనం కొనే ప్రొడక్టులపై ఎవరు భరోసా ఇస్తారు..? రికమెండెడ్ బై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, పేటీఎం మాల్ అంటూ చెప్పే ఆయా సైట్లు నిజంగానే మనకు కలిగే నష్టానికి భరోసా ఇస్తాయా..?

మనం ఈ-కామర్స్ సైట్లలో కొనే ప్రతీ వస్తువుకు భరోసా ఉండదు. ఎందుకంటే ఆ వస్తువు ఎక్కడ తయారీ అయ్యిందో.. ఎక్కడ నుంచి వ్యాపార లావాదేవీలు నడిపిస్తున్నారో తెలియదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ లావాదేవీలపై గతంలోనే నిర్థిష్ట ప్రమాణాలను రూపొందించింది. దాని ప్రకారం ఒక సంస్థకు మాత్రమే చెందిన వస్తువును వాళ్ల ఆన్‌లైన్ సైట్లలో విక్రయించడం నిషేధించింది.

ఫిబ్రవరి 1 నుంచి దీనికి సంబంధించిన నిబంధనలు అమలులోనికి రావడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా పలు వెబ్‌సైట్లు తమకు మాత్రమే పరిమితమైన ఉత్పత్తులను ఆయా సైట్ల నుంచి తొలగించాయి.

దీంతో గత రెండు రోజులుగా ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి ఎక్స్‌క్లూజీవ్ ఉత్పత్తుల విక్రయాలు ఆగిపోయాయి.

సొంత ఉత్పత్తులను ఆయా సైట్లలో ఎక్కువ ప్రచారం చేసుకొని అమ్ముతున్నారని…. తద్వారా చిన్న వ్యాపారులకు అన్యాయం జరుగుతుందనే నెపం వీరిపై ఉంది.

దీంతో ఈ కామర్స్ సైట్లలో కూడా ట్రాయ్ లాంటి నిబంధనలు అమలు చేస్తున్నారు. వినియోగదారునికి అవసరమైన వస్తువులను ముందుగా చూపాల్సిన బాధ్యత ఈ-కామర్స్ సైట్లపై పడింది.

First Published:  1 Feb 2019 9:40 PM GMT
Next Story