Telugu Global
National

తెలుగు విద్యార్థులను విడిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి!

అమెరికాలో నకిలీ విద్యార్థి వీసా రాకెట్ లో చిక్కుకున్న విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొంత మంది తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. దీంతో తెలుగు విద్యార్థులను ఆదుకోవాలనే అంశంపై అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా కేటీఆర్ తో భేటీ అయిన సందర్భంగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులను విడిపించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఏం జరిగింది…అక్కడి చట్టాల ప్రకారం తెలుగు విద్యార్థుల […]

తెలుగు విద్యార్థులను విడిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి!
X

అమెరికాలో నకిలీ విద్యార్థి వీసా రాకెట్ లో చిక్కుకున్న విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొంత మంది తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. దీంతో తెలుగు విద్యార్థులను ఆదుకోవాలనే అంశంపై అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా కేటీఆర్ తో భేటీ అయిన సందర్భంగా ఆమెకు విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులను విడిపించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఏం జరిగింది…అక్కడి చట్టాల ప్రకారం తెలుగు విద్యార్థుల పరిస్థితి గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలుగు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరినట్లు సమాచారం.

దీంతోపాటుగా తెలంగాణ, అమెరికా సంబంధాలపై కూడా కేటీఆర్ చర్చించారు. తెలుగు విద్యార్థుల విషయాలపై చర్చించిన అంశాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని హడ్డాను కేటీఆర్ కోరారు.

First Published:  1 Feb 2019 9:00 PM GMT
Next Story