Telugu Global
NEWS

రోహిత్ శర్మ, మిథాలీ రాజ్ లకు 200 షాక్....

కివీ గడ్డపై భారత పురుషుల, మహిళల జట్ల సేమ్ టు సేమ్ హామిల్టన్ వన్డేలో విరాట్ ఆర్మీ, మిథాలీ సేనలకు షాక్ కెరియర్ 200వ మ్యాచ్ లో కెప్టెన్లుగా రోహిత్, మిథాలీ ఫ్లాప్ భారత పురుషుల, మహిళల జట్లకు ఒకటే అనుభవం న్యూజిలాండ్ తో పురుషుల, మహిళల వన్డే సిరీస్ లో… హామిల్టన్ వేదికగా ముగిసిన మ్యాచ్ ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు మాత్రమే కాదు… కెప్టెన్లకు సైతం… ఒకే విధమైన ఫలితాలు ఎదురయ్యాయి.  వన్డే […]

రోహిత్ శర్మ, మిథాలీ రాజ్ లకు 200 షాక్....
X
  • కివీ గడ్డపై భారత పురుషుల, మహిళల జట్ల సేమ్ టు సేమ్
  • హామిల్టన్ వన్డేలో విరాట్ ఆర్మీ, మిథాలీ సేనలకు షాక్
  • కెరియర్ 200వ మ్యాచ్ లో కెప్టెన్లుగా రోహిత్, మిథాలీ ఫ్లాప్
  • భారత పురుషుల, మహిళల జట్లకు ఒకటే అనుభవం

న్యూజిలాండ్ తో పురుషుల, మహిళల వన్డే సిరీస్ లో… హామిల్టన్ వేదికగా ముగిసిన మ్యాచ్ ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు మాత్రమే కాదు… కెప్టెన్లకు సైతం… ఒకే విధమైన ఫలితాలు ఎదురయ్యాయి.

వన్డే క్రికెట్ చరిత్రలోని ఈ అసాధారణ ఫలితంపై స్పెషల్ స్టోరీ…..

తొలిసారిగా పురుషుల, మహిళల సిరీస్ లు…

న్యూజిలాండ్ తో 2019 వన్డే సిరీస్ ల కోసం… భారత పురుషుల, మహిళల జట్లు…ఏకకాలంలో పర్యటన ప్రారంభించాయి. అంతేకాదు… ఒకరోజు తేడాతో పురుషుల, మహిళల జట్లు కివీస్ తో వన్డే సిరీస్ లోని మ్యాచ్ లు ఆడుతూ వస్తున్నాయి.

ఒకే వేదికలో …కొద్ది గంటల తేడాలో మ్యాచ్ లు ఆడిన భారతజట్లు ఒకే తీరు ఫలితాలు, గెలుపు, ఓటమిని ఎదుర్కొనడం ఇప్పుడు క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

పురుషుల జోరు- మహిళల హోరు…

న్యూజిలాండ్ పురుషుల జట్టుతో జరుగుతున్న పాంచ్ పటాకా వన్డే సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ ల్లో …విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా… విజయాల హ్యాట్రిక్ తో సిరీస్ ఖాయం చేసుకొంది.

మరోవైపు…న్యూజిలాండ్ మహిళలతో జరిగిన తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండు వన్డేలను మిథాలీ సారథ్యంలోని భారతజట్టు నెగ్గి 2-0తో పైచేయి సాధించింది.

ఐదుమ్యాచ్ ల సిరీస్ లో పురుషుల జట్టు 3-0 ఆధిక్యం, మూడుమ్యాచ్ ల సిరీస్ లో మహిళల జట్టు 2-0తో పైచేయి సాధించిన తరుణంలో…. మ్యాచ్ ల వేదిక…హామిల్టన్ కు మారింది. దీంతో భారత పురుషుల, మహిళల జట్ల కు మాత్రమే కాదు… రెండుజట్ల కెప్టెన్లకు సీన్ రివర్స్ అయ్యింది.

హామిల్టన్ వేదికగా సీన్ రివర్స్….

హామిల్టన్ లోని సెడ్డాన్ పార్క్ వేదికగా ముగిసిన …నాలుగో వన్డేలో …రోహిత్ శర్మ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా… అక్కడి స్వింగ్ కమ్ సీమింగ్ వికెట్ పై 30.5 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది.

న్యూజిలాండ్ కేవలం 2 వికెట్ల నష్టానికే లక్ష్యం చేరి… టీమిండియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ఈమ్యాచ్ ముగిసిన 24 గంటల తేడాలోనే…భారత మహిళల జట్టు సైతం…హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో మూడో వన్డే ఆడి… 44 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటయ్యింది.

సమాధానంగా న్యూజిలాండ్ జట్టు 2 వికెట్ల నష్టానికే 150 పరుగుల లక్ష్యం సాధించి విజేతగా నిలిచింది.

హామిల్టన్ వేదికగా భారత పురుషుల, మహిళల జట్లు ఒకే తీరుగా కుప్పకూలడం…8 వికెట్ల తేడాతోనే చిత్తుగా ఓడటం విశేషం.

రోహిత్, మిథాలీలకు 200 షాక్….

అంతేకాదు…హామిల్టన్ వేదికగానే భారత పురుషుల, మహిళల కెప్టెన్లు రోహిత్ శర్మ, మిథాలీ రాజ్…తమ వన్డే కెరియర్ లో 200వ మ్యాచ్ లు ఆడారు. చేదు అనుభవాన్ని చవిచూశారు.

రోహిత్ శర్మ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగి కేవలం 7 పరుగుల వ్యక్తిగత స్కోరుకే అవుటయ్యాడు.

అంతేకాదు…మహిళల వన్డేలో సైతం వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన మిథాలీ రాజ్ 9 పరుగుల స్కోరుకే పెవీలియన్ దారి పట్టింది. మిథాలీకి సైతం తన కెరియర్ 200వ మ్యాచ్ లో.. నిరాశ తప్పలేదు.

ఇటు టాపార్డర్ ప్లేయర్లుగా…అటు కెప్టెన్లుగా రోహిత్ శర్మ, మిథాలీ రాజ్ లకు… హామిల్టన్ వన్డే మ్యాచ్ లు …ఒకే రకమైన అనుభవాలను మిగల్చడం…యాధృచ్చికమా?…కాకతాళీయమా? క్రికెట్ విచిత్రమా? అనుకొంటూ భారత క్రికెట్ అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

First Published:  1 Feb 2019 11:05 PM GMT
Next Story