Telugu Global
NEWS

ప్రపంచ మహిళా క్రికెట్లో భారత సంచలనం స్మృతి మంధానా

ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్ గా మంధానా గత 10 వన్డేల్లో 8 హాఫ్ సెంచరీలతో మంధానా జోరు భారత టాపార్డర్ కే కీలకం స్మృతి మంధానా ప్రపంచ మహిళా వన్డే క్రికెట్లో… భారత ఓపెనర్ కమ్ మరాఠా మెరుపుతీగ 22 ఏళ్ల స్మృతి మంధానా పరుగుల హోరు, సెంచరీల జోరుతో చెలరేగిపోతోంది. న్యూజిలాండ్ తో  జరుగుతున్న  ఐసీసీ తీన్మార్ చాలెంజ్ సిరీస్ లో సైతం మంధానా విశ్వరూపం ప్రదర్సించింది. కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ప్రత్యర్థిజట్ల గుండెల్లో […]

ప్రపంచ మహిళా క్రికెట్లో భారత సంచలనం స్మృతి మంధానా
X
  • ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్ గా మంధానా
  • గత 10 వన్డేల్లో 8 హాఫ్ సెంచరీలతో మంధానా జోరు
  • భారత టాపార్డర్ కే కీలకం స్మృతి మంధానా

ప్రపంచ మహిళా వన్డే క్రికెట్లో… భారత ఓపెనర్ కమ్ మరాఠా మెరుపుతీగ 22 ఏళ్ల స్మృతి మంధానా పరుగుల హోరు, సెంచరీల జోరుతో చెలరేగిపోతోంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐసీసీ తీన్మార్ చాలెంజ్ సిరీస్ లో సైతం మంధానా విశ్వరూపం ప్రదర్సించింది. కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ప్రత్యర్థిజట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

నయాస్టార్ స్మృతి మంధానా…

భారత మహిళా క్రికెట్ అనగానే మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే కాదు…డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానా కూడా అని.. అనుకొనే రోజులు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచ మహిళా క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్మృతి మంధానా మాత్రమే.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ..2017 ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ లో మాత్రమే కాదు….న్యూజిలాండ్ తో జరుగుతున్న 2019 ఐసీసీ ఛాలెంజ్ వన్డే సిరీస్ లోనూ మంధానా మెరుపులు మెరిపిస్తోంది.

వన్డే ప్రపంచకప్ తో టాప్…

వన్డే ప్రపంచకప్ లో నిలకడగా రాణించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకొన్న 22 ఏళ్ల మంధానా ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు.

ప్రపంచకప్ .. ఎనిమిదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో… ఆడిన మొదటి రెండు రౌండ్లలోనూ… భారత్ తిరుగులేని విజయాలు సాధించడం వెనుక… యువ ఓపెనర్ స్మృతి మంధానా పాత్ర ఎంతో ఉంది.

ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్ పై స్మృతి మంధానా చెలరేగి ఆడింది. ఇంగ్లీష్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ…ఆఫ్ సైడ్… ఆన్ సైడ్ అన్నతేడా లేకుండా…. స్టయిలిష్ బ్యాటింగ్ తో బౌండ్రీల వర్షం కురిపించింది. చివరకు సెంచరీకి పది పరుగుల దూరంలో అవుటయ్యింది.

2002 తర్వాత ఇంగ్లండ్ పై భారత్ తొలివిజయం సాధించడంలో ప్రధాన పాత్ర వహించడమే కాదు…ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం అందుకొంది.

ఇక…వెస్టిండీస్ తో ముగిసిన రెండోరౌండ్ పోటీలో మాత్రం స్మృతి మందానా…బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో తనజట్టును ఆదుకొంది. అజేయ సెంచరీతో విజేతగా నిలిపింది.

కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలసి మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో భారత్ కు 7 వికెట్ల విజయం ఖాయం చేసింది. మందానా మొత్తం 108 బాల్స్ లో ..13 బౌండ్రీలు, 2 సిక్సర్లతోపాటు… 106 పరుగులతో అజేయంగా నిలిచింది. వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొని..వారేవ్వా అనిపించుకొంది.

ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్…..

2017-18 సంవత్సరానికి ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్, అత్యుత్తమ వన్డే క్రికెటర్ అవార్డులు గెలుచుకొని …వారేవ్వా అనిపించుకొంది.

అంతేకాదు…న్యూజిలాండ్ తో న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ తీన్మార్ చాలెంజ్ సిరీస్ లో సైతం… మంధానా ఆకాశమే హద్దుగా రాణిస్తోంది.

న్యూజిలాండ్ సిరీస్ లోనూ…..

నేపియర్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో మంధానా ఏకంగా105 పరుగులతో సెంచరీ సాధించి… తన శతకాల సంఖ్యను నాలుగుకు పెంచుకొంది.

3 సిక్సర్లు 4 బౌండ్రీలతో సెంచరీ బాదిన మంధానా…జెమీమాతో కలసి మొదటి వికెట్ కు 190 పరుగుల భాగస్వామ్యం తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్ ప్రత్యర్థిగా భారత మహిళా ఓపెనర్లకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

ఇక..మౌంట్ మాంగునీలోని ..బే ఓవల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సైతం.. మంధానా మెరుపులు మెరిపించింది. ఏకంగా 90 పరుగుల నాటౌట్ స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.

కెప్టెన్ మిథాలీతో జంటగా మూడో వికెట్ కు 151 పరుగుల అజేయ భాగస్వామ్యంతో వరుసగా రెండో విజయంతో పాటు… సిరీస్ సైతం ఖాయం చేసింది. స్మృతి మంధానా ఆడిన గత 10 వన్డేల్లో 8 హాఫ్ సెంచరీలతో అరుదైన రికార్డు సాధించింది.

క్రికెట్ కుటుంబం నుంచి….

మహారాష్ట్ర లోని సాంగ్లీ నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి 20 ఏళ్ల వయసులో దూసుకొచ్చిన స్మృతి మంధానా…. ఎటాకింగ్ షాట్లు, స్ట్రోక్ పుల్ ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి జట్ల బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

తండ్రి, సోదరుడు..ఇద్దరూ క్రికెటర్లే కావడంతో…క్రికెట్ పట్ల బాల్యం నుంచే మక్కువ పెంచుకొన్న మంధానా….సబ్ జూనియర్, జూనియర్ స్థాయిల్లో నిలకడగా రాణించడం ద్వారా… భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించింది. కేవలం రెండేళ్ల కాలంలోనే భారత మహిళాక్రికెట్ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించింది.

సౌరవ్ గంగూలీని ఎంతగానే అభిమానించే స్మృతి మందానా…ఆఫ్ సైడ్, ఆన్ సైడ్లో…. అచ్చం దాదాలానే షాట్లు కొడుతూ….. లేడీ సౌరవ్ గంగూలీ అనిపించుకొంటోంది. రానున్న కాలంలో… ప్రపంచ మహిళాక్రికెట్ కాబోయే సూపర్ స్టార్.. స్మృతి మంధానా అన్నా అతిశయోక్తికాదు.

First Published:  2 Feb 2019 8:30 AM GMT
Next Story