Telugu Global
National

రాబర్ట్ వాద్రాకు ముందస్తు బెయిల్

ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఫిబ్రవరి 16 వరకు ఆయనను అరెస్టు చేయకుండా ఈ బెయిల్ ఉపయోగపడనుంది. లండన్‌లోని 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఒక ఆస్తి లావాదేవీలో అవకతవకలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ కేసులో వాద్రా అరెస్టుకు రంగం సిద్దమైన వార్తల నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వాద్రా స్నేహితుడు […]

రాబర్ట్ వాద్రాకు ముందస్తు బెయిల్
X

ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఫిబ్రవరి 16 వరకు ఆయనను అరెస్టు చేయకుండా ఈ బెయిల్ ఉపయోగపడనుంది.

లండన్‌లోని 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఒక ఆస్తి లావాదేవీలో అవకతవకలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ కేసులో వాద్రా అరెస్టుకు రంగం సిద్దమైన వార్తల నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వాద్రా స్నేహితుడు మనోజ్ ఆరోరా కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు. విదేశాల్లో వాద్రాకు ఉన్న ఆస్తులు వెల్లడించాలని కోరినా ఇంత వరకు స్పందించలేదు. వాద్రా ఆస్తుల వివరాలు ఆయన సన్నిహితుడైన మనోజ్‌కు తెలిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

లండన్‌లోని బ్రియాన్‌స్టోన్ ప్రాంతంలో ఉన్న ఒక భవంతిని కొని దానిని రినోవేషన్ చేస్తున్నారని…. దానికి నిధులు కూడా పంపిస్తున్నారని వాద్రపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలియ జేసింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే తనపై పీఎం మోడీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను విచారణ అధికారులకు ఇచ్చామని వాద్రా లాయర్ కేటీఎస్ తులసి తెలిపారు.

First Published:  2 Feb 2019 6:21 AM GMT
Next Story