Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజు.... వారసుడు హీరోగా రాబోతున్నాడు

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో మంది స్టార్ హీరోస్ కి, చిన్న హీరోలకి హిట్స్ ఇచ్చి వాళ్ళ కెరీర్ లో స్పెషల్ పర్సన్ గా నిలిచాడు. ఇప్పుడు అలాంటి ఆయన తన ఫ్యామిలీ నుంచి ఒక హీరోని ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు. అవును దిల్ రాజు తో పాటు నిర్మాణం లో భాగం అయిన శిరీష్ కొడుకు ఆశిష్ ని ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేయనున్నాడు దిల్ రాజు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న […]

దిల్ రాజు.... వారసుడు హీరోగా రాబోతున్నాడు
X

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో మంది స్టార్ హీరోస్ కి, చిన్న హీరోలకి హిట్స్ ఇచ్చి వాళ్ళ కెరీర్ లో స్పెషల్ పర్సన్ గా నిలిచాడు. ఇప్పుడు అలాంటి ఆయన తన ఫ్యామిలీ నుంచి ఒక హీరోని ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు.

అవును దిల్ రాజు తో పాటు నిర్మాణం లో భాగం అయిన శిరీష్ కొడుకు ఆశిష్ ని ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేయనున్నాడు దిల్ రాజు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమాకు “పలుకే బంగారమాయె” అనే టైటిల్ కూడా పెట్టారు.

ఈ సినిమాతో సతీష్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు దిల్ రాజు.

అయితే దిల్ రాజు కి, దిల్ రాజు ఫ్యామిలీ కి సంక్రాంతి పండగ అచ్చొచ్చింది. అలాంటి సంక్రాంతి పండగ రోజే తన వారసుణ్ణి కూడా తెర పై ప్రేక్షకులకి చూపించాలి అనేది దిల్ రాజు ప్లాన్. ప్రస్తుతం దిల్ రాజు మహేష్ బాబు హీరోగా వస్తున్న “మహర్షి” షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

First Published:  3 Feb 2019 8:00 AM GMT
Next Story