Telugu Global
NEWS

అప్పుడు క్రికెటర్... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్

న్యూజిలాండ్ లో క్రికెటర్ల జీవితాలు అంతంతే! భారత మాజీ క్రికెటర్లు కళకళ… విదేశీ మాజీ క్రికెటర్లు వెలవెల భారత్ లో పలువురు స్టార్ క్రికెటర్లు తమ రిటైర్మెంట్ జీవితాన్ని నిశ్చింతగా… విలాసవంతంగా… అత్యంత గౌరవప్రదంగా గడుపుతుంటే…. న్యూజిలాండ్ లో పలువురు మాజీ క్రికెటర్లు తమ కుటుంబ పోషణ కోసం నానా పాట్లు పడుతున్నారు. న్యూజిలాండ్ మాజీ డాషింగ్ ఓపెనర్ మార్క్ గ్రేట్ బ్యాచ్…రిటైర్మెంట్ తర్వాత…పండ్లతోటలు సాగు చేసుకొంటూ రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతుంటే…పేస్ బౌలింగ్ మాజీ ఆల్ రౌండర్ ఇవాన్ […]

అప్పుడు క్రికెటర్... ఇప్పుడు క్యాబ్ డ్రైవర్
X
  • న్యూజిలాండ్ లో క్రికెటర్ల జీవితాలు అంతంతే!
  • భారత మాజీ క్రికెటర్లు కళకళ… విదేశీ మాజీ క్రికెటర్లు వెలవెల

భారత్ లో పలువురు స్టార్ క్రికెటర్లు తమ రిటైర్మెంట్ జీవితాన్ని నిశ్చింతగా… విలాసవంతంగా… అత్యంత గౌరవప్రదంగా గడుపుతుంటే…. న్యూజిలాండ్ లో పలువురు మాజీ క్రికెటర్లు తమ కుటుంబ పోషణ కోసం నానా పాట్లు పడుతున్నారు.

న్యూజిలాండ్ మాజీ డాషింగ్ ఓపెనర్ మార్క్ గ్రేట్ బ్యాచ్…రిటైర్మెంట్ తర్వాత…పండ్లతోటలు సాగు చేసుకొంటూ రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతుంటే…పేస్ బౌలింగ్ మాజీ ఆల్ రౌండర్ ఇవాన్ చాట్ ఫీల్డ్ 68 ఏళ్ల లేటు వయసులో…కుటుంబ పోషణ కోసం క్యాబ్ డ్రైవర్ గా జీవిస్తున్నాడు.

చచ్చిబతికిన ఇవాన్….

క్రికెట్ చరిత్రలో..చచ్చిబతికిన తొలి క్రికెటర్ ఎవరంటే ఇవాన్ చాట్ ఫీల్డ్ అన్న జవాబే వస్తుంది. న్యూజిలాండ్ రాజధాని వెలింగ్టన్ సమీపంలోని ఓ క్లబ్ కు 1968 ఫిబ్రవరి నుంచి ఆడుతూ వస్తున్న ఇవాన్.. క్లబ్ స్థాయి క్రికెటర్ నుంచి అంతర్జాతీయస్థాయి క్రికెటర్ గా ఎదిగాడు.

న్యూజిలాండ్ టెస్ట్, వన్డే జట్లలో కీలక సభ్యుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. మీడియం పేస్ బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో ఉపయుక్తమైన బ్యాట్స్ మన్ గా కూడా ఇవాన్ గుర్తింపు తెచ్చుకొన్నాడు.

1975లో ఈడెన్ పార్క్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో….టాపార్డర్ ఆటగాడు జెఫ్ హొవార్త్ తో కలసి ఆఖరి వికెట్ కు 44 పరుగుల కీలకభాగస్వామ్యం నమోదు చేసి తనజట్టును ఆదుకొన్నాడు.

బౌన్సర్ దెబ్బతో కుప్పకూలిన ఇవాన్…

అదే సమయంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ పీటర్ లీవర్ విసిరిన బౌన్సర్ వచ్చి…ఇవాన్ తల పైభాగంలో ఉన్న హెల్మెట్ ను బలంగా తాకడంతో…బ్యాటింగ్ క్రీజు దగ్గరే కుప్పకూలిపోయాడు. కొద్దిక్షణాలపాటు గుండె పనిచేయటం ఆగిపోయింది.

దాంతో ఇంగ్లండ్ ఫిజియో బెర్నార్డ్ థామస్..సీపీఆర్ టెక్నిక్ తో ఇవాన్ కు పునర్జన్మ ప్రసాదించారు. ఆ తర్వాత కూడా ఇవాన్ …కీవీ టెస్ట్, వన్డే జట్లలో సభ్యుడిగా కొనసాగాడు. తన కెరియర్ లో మొత్తం 43 టెస్టులు, 114 వన్డేలు ఆడిన రికార్డు సైతం ఇవాన్ కు ఉంది.

వెలింగ్టన్ లోని నియో నియో ఓల్డ్ బాయ్స్ క్లబ్ కు 51 సీజన్లపాటు ఆడిన అనంతరం…ఇవాన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 68 సంవత్సరాల వయసు వరకూ తనకు నచ్చిన క్రికెట్ ఆడుకొంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన ఇవాన్ కు..రిటైర్మెంట్ తర్వాత అసలు కష్టం వచ్చి పడింది.

క్యాబ్ డ్రైవర్ గా….

కుటుంబాన్ని పోషించాలంటే సంపాదన ఉండాలి. సంపాదన కావాలంటే…క్యాబ్ డ్రైవర్ గా మారడం మినహా వేరే దారి లేకపోడంతో… ఇవాన్ అదే మార్గాన్ని ఎంచుకొన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల క్రికెట్ గ్రౌండ్స్ లో కనిపించిన ఇవాన్… ఇప్పుడు వెలింగ్టన్ నగర రోడ్లలో క్యాబ్ డ్రైవర్ గా దర్శనమిస్తున్నాడు.

బేసిన్ రిజర్వ్ టు వెస్ట్ ప్యాక్ ట్రస్ట్….

అలనాటి బేసిన్ రిజర్వ్ పార్క్ లో న్యూజిలాండ్ జాతీయజట్టులో సభ్యుడిగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ఇవాన్..ప్రస్తుత అత్యాధునిక వెస్ట్ ప్యాక్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లకు…కివీ మాజీ క్రికెటర్ హోదాలో అతిథిగా వచ్చి చూసి మరీ వెళుతున్నాడు. రోజుల తరబడి క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోడంతో…ఓ సెషన్ పాటు మాత్రమే వీక్షించి మరీ వెళుతున్నాడు.

భారత మాజీ క్రికెటర్లందరూ ..క్రికెటర్లుగా కోట్ల రూపాయల సంపాదనతో పాటు…బీసీసీఐ నుంచి నెలకు కనీసం 30 వేల నుంచి 50 వేల వరకూ పెన్షన్ అందుకొంటూ…జీవితాన్ని హాయిగా , దర్జాగా లాగించేస్తుంటే…న్యూజిలాండ్ లాంటి దేశంలో మాత్రం… రిటైర్మెంట్ జీవితాన్ని గడపడానికి అక్కడి మాజీ క్రికెటర్లు నానాపాట్లు పడతున్నారు. దానికి 68 ఏళ్ల ఇవాన్ చాట్ ఫీల్డ్ జీవితమే నిదర్శనం.

క్రికెటర్ గా పుడితే భారత్ లోనే పుట్టాలి. ఇది మాత్రం ముమ్మాటికీ నిజం.

First Published:  2 Feb 2019 7:25 PM GMT
Next Story