Telugu Global
National

హిమాచల్‌ప్రదేశ్ ప్రజలకు మంచు కష్టాలు

ఉత్తర భారతంలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రజలను మంచు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంచు కురుస్తోంది. రాష్ట్రంలోని రోడ్లనీ మంచుతో నిండిపోవడంతో అధికారులు రహదారులు మూసేశారు. మంచును తొలగించడానికి దాదాపు 200 యంత్రాలను వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 3 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మంచు కారణంగా 1760 ట్రాన్స్‌ఫార్మర్లు పాడవగా వాటిలో దాదాపు 1300 ట్రాన్స్‌ఫార్మర్లను బాగు […]

హిమాచల్‌ప్రదేశ్ ప్రజలకు మంచు కష్టాలు
X

ఉత్తర భారతంలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రజలను మంచు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అక్కడ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంచు కురుస్తోంది. రాష్ట్రంలోని రోడ్లనీ మంచుతో నిండిపోవడంతో అధికారులు రహదారులు మూసేశారు. మంచును తొలగించడానికి దాదాపు 200 యంత్రాలను వినియోగిస్తున్నారు.

రాబోయే రోజుల్లో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 3 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మంచు కారణంగా 1760 ట్రాన్స్‌ఫార్మర్లు పాడవగా వాటిలో దాదాపు 1300 ట్రాన్స్‌ఫార్మర్లను బాగు చేశారు. త్వరలోనే మిగిలిన వాటిని కూడా పునరుద్దరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.

బ్రహ్మోర్, పూహ్, కెలాంగ్, సలూనీ, కల్ప నగరాల్లో తీవ్రమైన ముంచుతో ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సిమ్లా, చంబా, పాలంపూర్, మనాలీ ప్రాంతాల్లో వర్షం కూడా పడుతోంది. ప్రభుత్వం మంచు, వర్షం నుంచి ప్రజలకు రక్షించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.

First Published:  2 Feb 2019 4:00 PM GMT
Next Story