Telugu Global
National

కేంద్ర ప్రభుత్వ కిసాన్ కంటే.... తెలంగాణ ‘‘రైతు బంధు’’, ఒడిషా ‘‘కలియాలే’’ మెరుగైనవి

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిన్న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అందరూ ఊహించినట్లే ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి పలు పథకాలు ప్రవేశపెట్టారు. ఎన్డీయే హయాంలో రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ”పీఎం – కిసాన్” పేరుతో రాబోతున్న ఈ పథకం ద్వారా రైతులకు 6వేల రూపాయల పెట్టుబడి సాయం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ”రైతు బంధు” పేరుతో […]

కేంద్ర ప్రభుత్వ కిసాన్ కంటే....  తెలంగాణ ‘‘రైతు బంధు’’,  ఒడిషా ‘‘కలియాలే’’ మెరుగైనవి
X

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిన్న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అందరూ ఊహించినట్లే ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి పలు పథకాలు ప్రవేశపెట్టారు.

ఎన్డీయే హయాంలో రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో మోడీ సర్కార్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ”పీఎం – కిసాన్” పేరుతో రాబోతున్న ఈ పథకం ద్వారా రైతులకు 6వేల రూపాయల పెట్టుబడి సాయం అందించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ”రైతు బంధు” పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ప్రతీ రబీ, ఖరీఫ్ సీజన్ల ముందు ఎకరాకు 4వేల రూపాయల చొప్పున ఏడాదికి 8వేలు అందిస్తున్నారు. ఇదే పథకం స్పూర్తితో ఒడిషా ప్రభుత్వం ”కలియా” అనే పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ఎకరాకు 12,500 రూపాయలను అందించనున్నారు.

అయితే కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు సిద్దం కాలేదు. ఇది తెలంగాణ రైతు బంధు స్పూర్తితోనే అందిస్తున్నట్లు అర్థం అవుతోంది. తెలంగాణలో రైతులకు సీజన్ ముందు నాలుగు వేలు చెక్కు రూపంలో అందిస్తున్నారు. కేంద్ర పథకంలో మాత్రం మూడు విడతల్లో అందిస్తామని మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు.

ఇక కేంద్ర ప్రభుత్వ పథకం రెండు హెక్టార్లు (ఐదు ఎకరాలు)కు మాత్రమే పరిమితం చేయగా.. తెలంగాణలో ఎన్ని ఎకరాలు ఉన్నా సాయం అందిస్తున్నారు. ఇటీవల రబీ సీజన్‌లో మాత్రం తెలంగాణలో 50 ఎకరాల వరకు మాత్రమే సాయం అందించారు.

వర్షాలు అధికంగా కురిసే ప్రాంతాల్లోని రైతులకు కేంద్రం విధించిన 2 హెక్టార్ల పరిమితి వల్ల నష్టమే జరగనుంది. రైతుల వద్ద అధిక భూమి ఉన్నా చాలా మంది పెట్టుబడి సాయం కోసం అప్పులు చేసే వాళ్లే ఉంటారు. దీంతో వీరికి అటు కేంద్ర సాయం రాక తిరిగి అప్పులు చేసే పరిస్థితి.

రైతులకు అందించే సాయాన్ని నేరుగా వారి బ్యాంకు అకౌంట్లకే ట్రాన్స్‌ఫర్ చేస్తామని పీయుష్ గోయల్ ప్రకటించారు. రైతు బంధు కూడా చెక్కుల రూపంలోనే పంపిణీ చేస్తున్నారు. గత సీజన్‌లో మాత్రం ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఆన్‌లైన్ ట్రాన్‌ఫర్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇంకా రూపుదిద్దుకోలేదు. కౌలు రైతులకు సాయం చేస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. తెలంగాణ రైతు బంధు కేవలం భూమి యజమానులకు మాత్రమే అందిస్తోంది. అయితే ఒడిషా ప్రకటించిన కలియా పథకంలో మాత్రం కౌలు రైతులనే కాక రైతు కూలీలను కూడా చేర్చారు.

ఒడిషానే కాక త్వరలో బెంగాల్ లోని మమత బెనర్జీ ప్రభుత్వం కూడా ఏడాదికి 5వేల సాయం చేసే పథకాన్ని ప్రకటించింది. ఇలా రాష్ట్రాల పథకాలను తీసుకుంటే కేంద్రం ప్రకటించిన పథకం మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. ఎలాంటి పరిశీలనలు, సమీక్షలు చేయకుండానే కేంద్రం హడావిడిగా ఈ పథకం ప్రకటించినట్లు ఉందని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సీఈవో జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు.

First Published:  2 Feb 2019 7:02 PM GMT
Next Story