Telugu Global
International

హెలికాఫ్టర్ నుంచి బిల్డింగ్ పైకి దూకిన సైకిలిస్ట్

అది దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్. ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ బిల్డింగ్‌లలో ఒకటిగా దానికి పేరుంది. దాని పైన ఒక హెలికాఫ్ట్ గాల్లో ఎగురుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక సైకిలిస్ట్ దాంట్లోంచి దూకి పర్‌ఫెక్ట్‌గా బిల్డింగ్ పైన ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ సైకిలిస్టు సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సైకిల్ వేసుకొని బిల్డింగ్ పైకి దూకిన ఆ సైక్లిస్ట్ పేరు క్రిస్ కైల్. స్కాట్లాండ్‌కు చెందిన ఇతను బీఎమ్ఎక్స్ రైడర్‌గా […]

హెలికాఫ్టర్ నుంచి బిల్డింగ్ పైకి దూకిన సైకిలిస్ట్
X

అది దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్. ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ బిల్డింగ్‌లలో ఒకటిగా దానికి పేరుంది. దాని పైన ఒక హెలికాఫ్ట్ గాల్లో ఎగురుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక సైకిలిస్ట్ దాంట్లోంచి దూకి పర్‌ఫెక్ట్‌గా బిల్డింగ్ పైన ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ సైకిలిస్టు సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సైకిల్ వేసుకొని బిల్డింగ్ పైకి దూకిన ఆ సైక్లిస్ట్ పేరు క్రిస్ కైల్. స్కాట్లాండ్‌కు చెందిన ఇతను బీఎమ్ఎక్స్ రైడర్‌గా చాలా ఫేమస్. హెలికాఫ్టర్ నుంచి బిల్డింగ్ పైన ఉన్న ర్యాంప్ మీదకు 16 అడుగుల దూరం ఉంది.

కేవలం హెల్మెట్ మాత్రమే ధరించిన ఈ సాహసి ఎలాంటి పొరపాటు చేయకుండా పర్‌ఫెక్ట్‌గా ల్యాండ్ అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విపరీతమైన గాలి కూడా వీస్తోంది.

ఈ సాహసం తర్వాత క్రిస్ కైల్ మాట్లాడుతూ.. దుబాయ్‌లో ఎన్నో సాహసాలు చేశాను కానీ ఇది మాత్రం కొంచెం భయంతోనే చేశాను. నాకు ఎత్తైన ప్రదేశాలంటే భయం. అందుకే మానసికంగా నా శరీరాన్ని ముందుగానే సిద్దం చేసుకున్నాను.

హెలికాఫ్టర్‌లో ఎగురుతున్నంత సేపు నేను కచ్చితంగా ఇది చేయాలి… నేను చేయగలను…. అంటూ నాలో నేను అనుకుంటూ ఉన్నానని ఆయన చెప్పారు.

First Published:  2 Feb 2019 6:30 PM GMT
Next Story