Telugu Global
NEWS

ర్యాం...కింగ్స్  విరాట్ కొహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా

మహేంద్ర సింగ్ ధోనీ ర్యాంక్ మరింత మెరుగు న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమిండియా అతిపెద్ద సిరీస్ విజయం ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల సరసన టీమిండియా న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా 4-1తో విజయం సాధించడం ద్వారా…వన్డే క్రికెట్లో రెండో ర్యాంక్ ను మరింత పదిలం చేసుకోగలిగింది. ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా …బ్యాట్స్ మన్, బౌలర్ల విభాగాలలో టాప్ ర్యాంక్ లను నిలబెట్టుకొన్నారు. […]

ర్యాం...కింగ్స్  విరాట్ కొహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా
X
  • మహేంద్ర సింగ్ ధోనీ ర్యాంక్ మరింత మెరుగు
  • న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమిండియా అతిపెద్ద సిరీస్ విజయం
  • ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల సరసన టీమిండియా

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా 4-1తో విజయం సాధించడం ద్వారా…వన్డే క్రికెట్లో రెండో ర్యాంక్ ను మరింత పదిలం చేసుకోగలిగింది.

ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో…టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా …బ్యాట్స్ మన్, బౌలర్ల విభాగాలలో టాప్ ర్యాంక్ లను నిలబెట్టుకొన్నారు.

లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ప్రస్తుత ఆరో ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్ కు చేరితే… వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ మూడుస్థానాల మేర మెరుగుపరచుకొని …17వ స్థానానికి చేరుకొన్నాడు.

ఐసీసీ టీమ్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఇంగ్లండ్ 126 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే… ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన సిరీస్ ల్లో విజేతగా నిలవడం ద్వారా టీమిండియా 122 పాయింట్లతో రెండోస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.

టీమిండియా అతిపెద్ద సిరీస్ విజయం….

స్వింగ్, పేస్ బౌలర్లకు అనువుగా ఉండే న్యూజిలాండ్ వికెట్ల పై…వన్డే ల్లో అతిపెద్ద సిరీస్ విజయం సాధించిన మూడో జట్టుగా …రెండోర్యాంకర్ టీమిండియా రికార్డుల్లో చేరింది.

వెలింగ్టన్ వేదికగా ముగిసిన ఐదో వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేయడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొంది.

1999-2000 సిరీస్ లో ఆస్ట్రేలియా 4-1తో న్యూజిలాండ్ ను కంగు తినిపిస్తే…2000- 2001 సిరీస్ లో శ్రీలంక సైతం 4-1తోనే న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఆ తర్వాత 18 ఏళ్లకు టీమిండియా సైతం 4-1తో సిరీస్ ను కైవసం చేసుకోగలిగింది.

వన్డే క్రికెట్ చరిత్రలో…కివీ గడ్డపై 4-1తో సిరీస్ విజయాలు సాధించిన జట్లు మాడంటే మూడుమాత్రమే ఉన్నాయంటే ఆశ్చర్యమే మరి.

దటీజ్ అంబటి రాయుడు…

న్యూజిలాండ్ తో పాంచ్ పటకా వన్డే సిరీస్ ఆఖరిమ్యాచ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన టీమిండియాను …90 పరుగుల స్కోరుతో ఆదుకొన్నాడు.

ఐదో వికెట్ కు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తో కలసి కీలకభాగస్వామ్యం నమోదు చేశాడు. మొత్తం 113 బాల్స్ ఎదుర్కొని 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 90 పరుగులు సాధించాడు. రాయుడి కెరియర్ లో ఇది 10వ హాఫ్ సెంచరీ కాగా…ప్రస్తుత సిరీస్ లో ఓ భారత బ్యాట్స్ మన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం మరో విశేషం.

అంతేకాదు…టీమిండియా 35 పరుగుల విజయంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా… ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం రాయుడు అందుకొన్నాడు. ప్రస్తుత సిరీస్ వరకూ రాయుడు ఆడిన 52 వన్డేల్లో 1661 పరుగుల తో 50.33 సగటు నమోదు చేశాడు. న్యూజిలాండ్ గడ్డ పైన సైతం రాయుడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ.

హార్ధిక్ పాండ్యా తీన్మార్….

వెలింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ఆఖరి వన్డేలో….టీమిండియా యువఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఓ అరుదైన రికార్డు సాధించాడు. మూడు వరుస బంతుల్లో సిక్సర్లు బాది…హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

కివీ లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్టల్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లు బాది …వారేవ్వా అనిపించుకొన్నాడు. 25 ఏళ్ల పాండ్యా కెరియర్ లో…సిక్సర్ల హ్యాట్రిక్ లు సాధించడం ఇది నాలుగో సారి.

2017 చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల్లో పాక్ పై గ్రూప్ పోటీలో ఇమాద్ వాసిం, ఫైనల్లో షదాబ్ ఖాన్ బౌలింగ్ లో సిక్సర్ల హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాదు..2017 సిరీస్ లో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్ లో సైతం పాండ్యా తన కెరియర్ మూడో హ్యాట్రిక్ సాధించాడు.

నాలుగు వన్డే మ్యాచ్ ల్లో నాలుగు సిక్సర్ల హ్యాట్రిక్ లు సాధించిన భారత తొలి క్రికెటర్ హార్ధిక్ పాండ్యా మాత్రమే కావడం విశేషం.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ షమీ….

న్యూజిలాండ్ తో ముగిసిన పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో…ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సొంతం చేసుకొన్నాడు. సిరీస్ లోని నాలుగు వన్డేల్లో నిలకడగా రాణించడం ద్వారా షమీ ఈ ఘనత సాధించాడు.

గత సిరీస్ ల్లో పేస్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సాధిస్తే…ఈసారి షమీ అంచనాలకు మించి రాణించాడు. ఆఖరి వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అంబటిరాయుడు అందుకొన్నాడు.

First Published:  4 Feb 2019 6:25 AM GMT
Next Story