Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ గా తెలుగు అమ్మాయిని తీసుకోబోతున్న హరీష్ శంకర్

డైరెక్టర్ హరీష్ శంకర్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా “వాల్మీకి”. తమిళ సూపర్ హిట్ సినిమా అయిన జిగర్తాండ కి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. తమిళ్ లో బాబీ సింహ చేసిన పాత్రని వరుణ్ తేజ్ తో చేయిస్తున్నాడు హరీష్ శంకర్. అలాగే తమిళ్ లో సిద్ధార్థ్ పోషించిన పాత్రకి ఇంకా ఏ హీరో ని అనుకోలేదు హరీష్ శంకర్. కానీ ఆ పాత్రకి హీరో శ్రీ విష్ణు ని తీసుకునే ఆలోచనలో […]

హీరోయిన్ గా తెలుగు అమ్మాయిని తీసుకోబోతున్న హరీష్ శంకర్
X

డైరెక్టర్ హరీష్ శంకర్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా “వాల్మీకి”. తమిళ సూపర్ హిట్ సినిమా అయిన జిగర్తాండ కి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.

తమిళ్ లో బాబీ సింహ చేసిన పాత్రని వరుణ్ తేజ్ తో చేయిస్తున్నాడు హరీష్ శంకర్. అలాగే తమిళ్ లో సిద్ధార్థ్ పోషించిన పాత్రకి ఇంకా ఏ హీరో ని అనుకోలేదు హరీష్ శంకర్. కానీ ఆ పాత్రకి హీరో శ్రీ విష్ణు ని తీసుకునే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు భామ అయిన ఈషా రెబ్బా ని తీసుకోవాలని అనుకుంటున్నాడట హరీష్ శంకర్. చిన్న సినిమాల ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ రీసెంట్ గా “అరవింద సమేత” లో మంచి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇప్పుడు ఈ భామని హరీష్ శంకర్ దర్శకత్వంలో మెయిన్ హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. 14 రీల్స్ ప్లస్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక్కసారి నటీనటులు అందరూ ఫిక్స్ అయ్యాక హరీష్ శంకర్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాడట.

First Published:  4 Feb 2019 12:40 AM GMT
Next Story