Telugu Global
National

ముఖ్యమైన అధికారులంతా చంద్రబాబు సామాజికవర్గం వారే " జగన్ సంచలన ఆరోపణ

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్‌ జగన్ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్… సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు చంద్రబాబు సొంత సామాజిక వర్గం పోలీసు అధికారులను వినియోగిస్తున్నారని జగన్ వివరించారు. 59 లక్షల దొంగ ఓట్లు టీడీపీ ఆధ్వర్యంలో నమోదు అయ్యాయిని జగన్‌ వివరించారు. మూడు కోట్ల 69 లక్షల ఓట్లు ఉంటే.. ఇందులో 59 లక్షలు దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఇంత దారుణంగా పరిస్థితి ఎన్నడూ […]

ముఖ్యమైన అధికారులంతా చంద్రబాబు సామాజికవర్గం వారే  జగన్ సంచలన ఆరోపణ
X

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్‌ జగన్ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్… సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు చంద్రబాబు సొంత సామాజిక వర్గం పోలీసు అధికారులను వినియోగిస్తున్నారని జగన్ వివరించారు.

59 లక్షల దొంగ ఓట్లు టీడీపీ ఆధ్వర్యంలో నమోదు అయ్యాయిని జగన్‌ వివరించారు. మూడు కోట్ల 69 లక్షల ఓట్లు ఉంటే.. ఇందులో 59 లక్షలు దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఇంత దారుణంగా పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. 20 లక్షల ఓట్లు హైదరాబాద్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఓట్లుగా ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఈసీకి అందజేశామన్నారు.

దొంగ ఓట్లు ఒకవైపు చేరుస్తూనే మరోవైపు వైసీపీ సానుభూతిపరుల ఓట్లను సర్వేల పేరుతో కనుక్కొని తీసివేయించే పని చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. ఇలా తీయించిన ఓట్లు ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా ఉన్నాయన్నారు. ప్రజాసాధికారిక సర్వే, రియల్ టైం సర్వే, పరిష్కార వేదిక ఇలా వివిధ పేర్లతో ఓటర్ల డేటా సేకరించి తొలగించే పని చేస్తున్నారని జగన్ వివరించారు.

చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన సీఐలను డీఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ లిస్ట్‌లో మొత్తం సొంత సామాజికవర్గం వారిని సీఐల నుంచి డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని జగన్ ఆరోపించారు. 37 మంది సీఐలకు ప్రమోషన్లు రాగా వారిలో చంద్రబాబు సామాజికవర్గం వారే 35 మంది ఉన్నారని లిస్ట్‌ చూపించారు. ఆ మిగిలిన ఇద్దరు సీఐలు కూడా చంద్రబాబు సామాజికవర్గంలో పెళ్లి చేసుకున్నారని జగన్‌ వివరించారు. ఈ లిస్ట్‌ను ఈసీకి ఇచ్చామన్నారు.

లా అండ్‌ ఆర్డర్‌లో కో- ఆర్డినేటర్‌ పోస్టు అంటూ ఒకటి సృష్టించి చంద్రబాబు నాయుడు సామాజికవర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారన్నారు. ఎన్నికలు నడిపించేందుకు కీలకమైన అన్ని స్థానాల్లోనూ చంద్రబాబు ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తున్నారని… ఈ విషయాన్ని కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని జగన్ చెప్పారు. ఆధారాలతో సహా అన్నీ సీఈసీకి అప్పగించామన్నారు.

ఎన్నికలు నిజాయితీగా జరగాలంటే ఈ పోలీసు అధికారులను పక్కన పెట్టాలని జగన్ కోరారు. వీరి స్థానంలో ఎవరిని నియమించినా తమకు అభ్యంతరం లేదన్నారు జగన్‌.

First Published:  4 Feb 2019 1:51 AM GMT
Next Story