Telugu Global
Cinema & Entertainment

అనీల్ రావిపూడికి గిఫ్ట్ రెడీ

ఇప్పటివరకు 31 సినిమాలు తీశాడు దిల్ రాజు. కానీ ఎఫ్2 ఇచ్చినంత లాభాన్ని ఏ సినిమా అందించలేకపోయింది. అవును.. ఈ ఒక్క సినిమానే దిల్ రాజుకు అటుఇటుగా 40 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. అటు బయ్యర్లు కూడా రూపాయికి రెండు రూపాయలు వెనకేసుకున్నారు. తనకు ఇంతటి ఘనవిజయాన్ని, డబ్బును తెచ్చిపెట్టిన దర్శకుడు అనీల్ రావిపూడికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. ఈ మేరకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ సిద్ధంచేశాడు. అనీల్ రావిపూడికి ఇవ్వాల్సిన […]

అనీల్ రావిపూడికి గిఫ్ట్ రెడీ
X

ఇప్పటివరకు 31 సినిమాలు తీశాడు దిల్ రాజు. కానీ ఎఫ్2 ఇచ్చినంత లాభాన్ని ఏ సినిమా అందించలేకపోయింది. అవును.. ఈ ఒక్క సినిమానే దిల్ రాజుకు అటుఇటుగా 40 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. అటు బయ్యర్లు కూడా రూపాయికి రెండు రూపాయలు వెనకేసుకున్నారు. తనకు ఇంతటి ఘనవిజయాన్ని, డబ్బును తెచ్చిపెట్టిన దర్శకుడు అనీల్ రావిపూడికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. ఈ మేరకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ సిద్ధంచేశాడు.

అనీల్ రావిపూడికి ఇవ్వాల్సిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇప్పటికే సిద్ధమైంది. అదేంటనేది మాత్రం సస్పెన్స్. కొందరేమో అనీల్ కు దిల్ రాజు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందిస్తాడని అంటుంటే.. మరికొందరు మాత్రం ఓ మంచి ఫ్లాట్ ను బహుమతిగా ఇవ్వబోతున్నాడంటూ చెబుతున్నారు. అది ఏంటనేది ఈ వారంలోనే తేలిపోతుంది.

సినిమాలు హిట్ అయితే ఇలా బహుమతులు ఇచ్చుకోవడం టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో సర్వసాధారణం అయింది. రెమ్యనరేషన్ తో సంబంధం లేకుండా ఇలా ఆశ్చర్యకరమైన బహుమతులు అందుకుంటున్నారు నిర్మాతలు. ఇలా అందరికంటే పెద్ద ఆశ్చర్యకరమైన బహుమతిని బాహుబలి-2 హిట్ అయినప్పుడు రాజమౌళి అందుకున్నాడని అంటారు. ఆ కాస్ట్ లీ గిఫ్ట్ ఏంటనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. కానీ దాని ఖరీదు మాత్రం అటుఇటుగా 40 కోట్ల రూపాయలని తెలుస్తోంది.

First Published:  5 Feb 2019 12:00 AM GMT
Next Story