Telugu Global
NEWS

కివీ గడ్డపై టీ-20 తొలి సిరీస్ విజయానికి టీమిండియా రెడీ

వెలింగ్టన్ వేదికగా ఉదయం 12-30 నుంచి రేపే తొలి టీ-20 కివీ గడ్డపై టీ-20 విజయంలేని టీమిండియా కివీ గడ్డపై రెండుకు రెండు టీ-20లు ఓడిన టీమిండియా కివీ గడ్డపై ధూమ్ ధామ్ టీ-20 సిరీస్ లో తొలివిజయానికి …రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఉరకలేస్తోంది. వెలింగ్టన్ వెస్ట్ ప్యాక్ ట్రస్ట్ స్టేడియం వేదికగా రేపు ప్రారంభమయ్యే తీన్మార్ సిరీస్ లోని… తొలి సమరానికి 3వ ర్యాంకర్ టీమిండియా, 4వ ర్యాంకర్ న్యూజిలాండ్ సై అంటే సై అంటున్నాయి. […]

కివీ గడ్డపై టీ-20 తొలి సిరీస్ విజయానికి టీమిండియా రెడీ
X
  • వెలింగ్టన్ వేదికగా ఉదయం 12-30 నుంచి రేపే తొలి టీ-20
  • కివీ గడ్డపై టీ-20 విజయంలేని టీమిండియా
  • కివీ గడ్డపై రెండుకు రెండు టీ-20లు ఓడిన టీమిండియా

కివీ గడ్డపై ధూమ్ ధామ్ టీ-20 సిరీస్ లో తొలివిజయానికి …రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఉరకలేస్తోంది. వెలింగ్టన్ వెస్ట్ ప్యాక్ ట్రస్ట్ స్టేడియం వేదికగా రేపు ప్రారంభమయ్యే తీన్మార్ సిరీస్ లోని… తొలి సమరానికి 3వ ర్యాంకర్

టీమిండియా, 4వ ర్యాంకర్ న్యూజిలాండ్ సై అంటే సై అంటున్నాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 12 గంటల 30 నిముషాలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

సరికొత్త చరిత్ర కోసం….

కివీ గడ్డపై వన్డే సిరీస్ లో అతిపెద్ద విజయం సాధించిన టీమిండియా…ఇప్పుడు ధూమ్ ధామ్ టీ-20 సిరీస్ కు సైతం గురిపెట్టింది.

ఫిబ్రవరి 6 నుంచి 10 వరకూ వెలింగ్టన్, అక్లాండ్, హామిల్టన్ నగరాలు వేదికలుగా జరిగే ఈ తీన్మార్ సిరీస్ కోసం…3వ ర్యాంకర్ టీమిండియా, 4వ ర్యాంకర్ న్యూజిలాండ్ సై అంటే సై అంటున్నాయి.

పాంచ్ పటాకా వన్డే సిరీస్ ను 4-1తో నెగ్గిన టీమిండియా….టీ-20 సిరీస్ లో సైతం అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే వెలింగ్టన్ వెస్ట్ ప్యాక్ ట్రస్ట్ స్టేడియంలో… రోహిత్ సేన ముమ్మరంగా సాధన చేసింది.

ఒక్క గెలుపూ లేదు….

న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటి వరకూ ఆడిన రెండుకు రెండు టీ-20 మ్యాచ్ ల్లోనూ పరాజయాలు పొందిన టీమిండియా…ప్రస్తుత సిరీస్ ద్వారా బోణీ కొట్టాలన్న పట్టుదలతో ఉంది.

యువఆటగాళ్లు రిషభ్ పంత్, రాహుల్ తుదిజట్టులో చేరడంతో టీమిండియా ఉరకలేసే ఉత్సాహంతో పోటీకి దిగుతోంది.

కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వెటరన్ మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్,యజువేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, షమీలతో పాటు ఆల్ రౌండర్ విజయ్ శంకర్, పాండ్యా బ్రదర్స్ కృణాల్, హార్ధిక్ లతో అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది.

ప్రతీకారం కోసం కివీస్…..

మరోవైపు…ఆతిథ్య న్యూజిలాండ్…కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలో…టీమిండియాను దెబ్బకు దెబ్బ తీసి…వన్డే సిరీస్ ఓటమికి బదులుతీర్చుకోవాలన్న కసితో ఉంది.

స్వింగ్, సీమ్ బౌలింగ్ కు అనువుగా ఉండే వెలింగ్టన్ పిచ్ పైన టాస్ నెగ్గిన జట్టు ముందుగా ప్రత్యర్థిని బ్యాటింగ్ కు దించే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంది.

సిరీస్ లోని రెండో మ్యాచ్ అక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 8న , సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ హామిల్టన్ వేదికగా ఈనెల 10న నిర్వహిస్తారు.

టగ్- ఆఫ్- వార్…..

ఇటు టీమిండియా…అటు న్యూజిలాండ్ జట్లు రెండు సమానబలంతో ఉండడంతో…..సిరీస్ రసపట్టుగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది.

భారత కాలమాన ప్రకారం ఈనెల 6,8, 10 తేదీలలో…ఉదయం 12 గంటల 30 నిముషాలకు మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి.

First Published:  5 Feb 2019 8:37 AM GMT
Next Story