Telugu Global
Cinema & Entertainment

ఐదుగురు కావాలంటున్న నాని

సాధారణంగా సినిమాలో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. కానీ నాని సినిమా కోసం ఏకంగా ఐదుగురు హీరోయిన్లను తీసుకుంటున్నారు. అవును.. తనకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కావాలంటున్నాడు ఈ నేచురల్ స్టార్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ నెలలోనే ఓ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు నాని. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీర్తిసురేష్ ను […]

ఐదుగురు కావాలంటున్న నాని
X

సాధారణంగా సినిమాలో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. కానీ నాని సినిమా కోసం ఏకంగా ఐదుగురు హీరోయిన్లను తీసుకుంటున్నారు. అవును.. తనకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కావాలంటున్నాడు ఈ నేచురల్ స్టార్.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ నెలలోనే ఓ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు నాని. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకున్నారు. రెండో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ను, మూడో హీరోయిన్ గా ప్రియా వారియర్ ను తీసుకున్నారు. ఇంకా నాలుగో హీరోయిన్, ఐదో హీరోయిన్ కూడా కావాలంట. ప్రస్తుతం వాళ్ల కోసం వేట కొనసాగుతోంది.

మిగిలిన ఇద్దరు భామల్లో ఒక హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆర్ఎక్స్100 బ్యూటీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. నాని సరసన కూడా ఛాన్స్ దక్కితే ఈమె కెరీర్ మరింత ఊపందుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా.

First Published:  4 Feb 2019 11:16 PM GMT
Next Story