Telugu Global
Cinema & Entertainment

"సాహో" లో భారీ గ్రాఫిక్స్

“బాహుబలి” లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సినిమా “సాహో”. దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాహో తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్న ఈ సినిమా పూర్తి షూటింగ్ మే వరకు పూర్తవుతుంది. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉందట. అందుకే ఈ సినిమా కోసం ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ […]

సాహో లో భారీ గ్రాఫిక్స్
X

“బాహుబలి” లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సినిమా “సాహో”. దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాహో తెరకెక్కుతుంది.

ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్న ఈ సినిమా పూర్తి షూటింగ్ మే వరకు పూర్తవుతుంది. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉందట. అందుకే ఈ సినిమా కోసం ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారట.

ఇప్పటికే సినిమా లో యాబై శాతం గ్రాఫిక్స్ పార్ట్ పూర్తయిందట. షూటింగ్ తో పాటు సినిమా గ్రాఫిక్స్ పై కూడా ఎక్కవ శ్రద్ధ తీసుకుంటున్నాడట ప్రభాస్. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్, విక్కి నిర్మిస్తున్నారు.

శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు,తమిళ, హిందీ బాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 15 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

First Published:  5 Feb 2019 7:53 AM GMT
Next Story