Telugu Global
Cinema & Entertainment

మొన్న సందీప్.... ఇప్పుడు అనీల్ రావిపూడి

హిట్ డైరక్టర్స్ ను వలవేసి పట్టుకోవడంలో మహేష్ బాబు కూడా ఇప్పుడు ముందున్నాడు. ఒకప్పుడు మెగా కాంపౌండ్ మాత్రమే ఈ పని చేసేది. కానీ ఇప్పుడు నమ్రత చొరవతో మహేష్ కూడా ఈ పని చేస్తున్నాడు. హిట్ దర్శకుల్ని పిలిచిమరీ అడ్వాన్సులు ఇచ్చే కార్యక్రమం షురూ చేశాడు. రంగస్థలం హిట్ అయిన వెంటనే సుకుమార్ ను లాక్ చేశాడు మహేష్. ప్రస్తుతం అతడితో కథాచర్చలు సాగుతున్నాయి. అంతకంటే ముందే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు […]

మొన్న సందీప్.... ఇప్పుడు అనీల్ రావిపూడి
X

హిట్ డైరక్టర్స్ ను వలవేసి పట్టుకోవడంలో మహేష్ బాబు కూడా ఇప్పుడు ముందున్నాడు. ఒకప్పుడు మెగా కాంపౌండ్ మాత్రమే ఈ పని చేసేది. కానీ ఇప్పుడు నమ్రత చొరవతో మహేష్ కూడా ఈ పని చేస్తున్నాడు. హిట్ దర్శకుల్ని పిలిచిమరీ అడ్వాన్సులు ఇచ్చే కార్యక్రమం షురూ చేశాడు.

రంగస్థలం హిట్ అయిన వెంటనే సుకుమార్ ను లాక్ చేశాడు మహేష్. ప్రస్తుతం అతడితో కథాచర్చలు సాగుతున్నాయి. అంతకంటే ముందే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు అడ్వాన్స్ ఇచ్చాడు. తాజాగా అనీల్ రావిపూడిని కూడా తనవైపు లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నాడు.

ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనీల్ రావిపూడికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు మహేష్. అడ్వాన్స్ ఇవ్వడంతో పాటు మంచి కథ తెస్తే తన సొంత బ్యానర్ పై సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చాడు. ఆ కథ కూడా ఎలా ఉండాలో చెప్పేశాడు. ఎంటర్ టైనర్స్ మలచడంలో అనీల్ దిట్ట. అదే జానర్ లో కథ సిద్ధంచేయమని చెప్పాడు మహేష్.

First Published:  5 Feb 2019 2:00 AM GMT
Next Story