స్పెయిన్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే “పడి పడి లేచే మనసు” సినిమాతో ఫ్లాప్ ని చవిచూసాడు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.

“పడి పడి లేచే మనసు” సినిమా లవ్ స్టొరీ గా తెరకెక్కితే సుధీర్ వర్మ సినిమా మాత్రం పూర్తి స్థాయి గ్యాంగ్ స్టర్ సినిమా గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరబాద్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న ఈ టీం తదుపరి షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. అక్కడ మూడు వారల పాటు కొన్ని ముఖ్యమైన సీన్స్ తో పాటు ఒక పాట కూడా షూట్ చేస్తారట.

శర్వానంద్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళీ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిని మరో హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్య దేవర నాగ వంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు “96” సినిమా తెలుగు రీమేక్ షూట్ లో పాల్గొననున్నాడు శర్వానంద్.