సోమిరెడ్డిపై ఆదాల ఫైర్

నెల్లూరు టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరుపై మాజీ ఎంపీ, నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌చార్జ్ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి భగ్గుమన్నారు.

రూరల్ ఇన్‌చార్జ్‌గా ఆదాల ఉన్నప్పటికీ ఆయనకు చెప్పకుండా సోమిరెడ్డి … నెల్లూరు రూరల్ నియోజక వర్గంపై సమీక్ష నిర్వహించడమే వివాదానికి కారణమైంది. సోమిరెడ్డి తీరుపై మంత్రి నారాయణ వద్ద ఆదాల మండిపడ్డారు.

అంతా ఆయన ఇష్టమేనా?. టికెట్లు కూడా ఆయన ఖరారు చేస్తారా?. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు?. అంటూ మంత్రి నారాయణ వద్ద ఆదాల ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

సర్వేపల్లిలో పోటీ చేయాలనుకుంటున్న సోమిరెడ్డికి నెల్లూరు రూరల్‌లో ఏం పని అని ఆదాల ప్రశ్నించారు. రోజుకో నేత తెరపైకి వచ్చి తామే నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారని… దీనిపై చంద్రబాబు వద్ద తేల్చుకుంటానని ఆదాల స్పష్టం చేశారు.