Telugu Global
NEWS

ప్రపంచకప్ కు అంబటి రాయుడు పక్కా!

నంబర్ 4 స్థానాన్ని ఖాయం చేసుకొన్న తెలుగు తేజం ఆఖరి వన్డే సూపర్ షోతో రాయుడికి బెర్త్ ఖాయం యువఆటగాళ్లతో పోరులో విన్నర్ రాయుడు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో…నాలుగో నంబర్ బ్యాట్స్ మన్ గా…తెలుగుతేజం అంబటి రాయుడు…తన స్థానాన్ని ఖాయం చేసుకొన్నాడు. వెలింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ఆఖరివన్డేలో తనకు లభించిన సువర్ణఅవకాశాన్ని రాయుడు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. తనలో ఓ ఆల్ […]

ప్రపంచకప్ కు అంబటి రాయుడు పక్కా!
X
  • నంబర్ 4 స్థానాన్ని ఖాయం చేసుకొన్న తెలుగు తేజం
  • ఆఖరి వన్డే సూపర్ షోతో రాయుడికి బెర్త్ ఖాయం
  • యువఆటగాళ్లతో పోరులో విన్నర్ రాయుడు

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే 2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో…నాలుగో నంబర్ బ్యాట్స్ మన్ గా…తెలుగుతేజం అంబటి రాయుడు…తన స్థానాన్ని ఖాయం చేసుకొన్నాడు.

వెలింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ఆఖరివన్డేలో తనకు లభించిన సువర్ణఅవకాశాన్ని రాయుడు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. తనలో ఓ ఆల్ రౌండ్ బ్యాట్స్్ మన్, మ్యాచ్ విన్నర్ దాగి ఉన్నాడని…సెలెక్టర్లకు, విమర్శకులకు తన ఆటతీరు, ఫైటింగ్ బ్యాటింగ్ తో చాటి చెప్పాడు.

దటీజ్ అంబటి రాయుడు….

భారత క్రికెట్లో కేవలం తన అసాధారణ ప్రతిభతోనే జట్టులో తన స్థానం కాపాడుకొంటూ వస్తున్న తెలుగుతేజం అంబటి రాయుడు… గతంలోనే జూనియర్ ప్రపంచకప్ లో పాల్గొన్న భారతజట్టుకు నాయకత్వం వహించాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే …ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ కంటే సీనియర్ బ్యాట్స్ మన్. అయితే…కొహ్లీలా ఆట మూడుఫార్మాట్లలో రాణించే సత్తా ఉన్నా… రాయుడు కెరియర్ లో…ఎందుకో ఆటుపోట్లను ఎదుర్కొనాల్సి వచ్చింది.

హైదరాబాద్, ఆంధ్ర క్రికెట్ సంఘాల రాజకీయాలతో విసిగివేసారిపోయిన రాయుడు…బీసీసీఐ పోటీలీగ్ లో పాల్గొని…ఆ తర్వాత బయటపడటం ద్వారా తన కెరియర్ ను గాడిలో ఉంచుకోగలిగాడు.

మాస్టర్ సచిన్ అండతో….

బరోడా రంజీ జట్టులో సభ్యుడిగా నిలకడగా రాణించిన అంబటి రాయుడు…సచిన్ టెండుల్కర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా చేరడంతోనే దశతిరిగి పోయింది.

ఐపీఎల్ లో సత్తా చాటుకోడం ద్వారా….టీమిండియా వన్డే జట్టులో చోటు సంపాదించగలిగాడు. గట్టి పోటీ ఎదురైనా..తనకు లభించిన పరిమిత అవకాశాలతో స్థానాన్ని పదిలం చేసుకోగలిగాడు.

ట్విన్ టూర్ లో మిశ్రమఫలితాలు….

2018 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా అత్యధిక పరుగులు సాధించిన అంబటి రాయుడు…వన్డే క్రికెట్ పైనే దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా…దేశవాళీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

రోహిత్ శర్మ నాయకత్వంలో…ఆసియాకప్ టోర్నీలో పాల్గొన్న భారత జట్టు కీలకసభ్యుడిగా రాయుడు 175 పరుగులతో 43. 75 సగటు నమోదు చేశాడు.

అంతేకాదు…ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ ల కోసం ఎంపికైన భారతజట్టులో సైతం చోటు నిలుపుకొన్నాడు.

ఆస్ట్రేలియాతో ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో రాయుడు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయినా…న్యూజిలాండ్ తో జరిగిన పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో మాత్రం నిలకడగా రాణిస్తూ వచ్చాడు.

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఆఖరి వన్డేలో రాయుడు చెలరేగిపోయాడు.

మ్యాచ్ విన్నర్ అంబటి రాయుడు….

న్యూజిలాండ్ తో పాంచ్ పటకా వన్డే సిరీస్ ఆఖరిమ్యాచ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన టీమిండియాను …90 పరుగుల స్కోరుతో ఆదుకొన్నాడు.

ఐదో వికెట్ కు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తో కలసి కీలకభాగస్వామ్యం నమోదు చేశాడు. మొత్తం 113 బాల్స్ ఎదుర్కొని 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 90 పరుగులు సాధించాడు.

52 వన్డేలు- 10 హాఫ్ సెంచరీలు….

రాయుడి కెరియర్ లో ఇది 10వ హాఫ్ సెంచరీ కాగా…ప్రస్తుత సిరీస్ లో ఓ భారత బ్యాట్స్ మన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం మరో విశేషం. అంతేకాదు…టీమిండియా 35 పరుగుల విజయంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా…ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం రాయుడు అందుకొన్నాడు.

ప్రస్తుత సిరీస్ వరకూ రాయుడు ఆడిన 52 వన్డేల్లో 1661 పరుగుల తో 50.33 సగటు నమోదు చేశాడు. న్యూజిలాండ్ గడ్డ పైన సైతం రాయుడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ.

న్యూజిలాండ్ తో సిరీస్ లో ఐదుకు ఐదు మ్యాచ్ లు ఆడిన రాయుడు 190 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఏకంగా 63.33 సగటు నమోదు చేశాడు. సిరీస్ లోనే అత్యధికంగా 90 పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్ మన్ గా నిలిచాడు.

ప్రశంసల వెల్లువ….

వెలింగ్టన్ వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడిన అంబటి రాయుడిపై…మొహిందర్ అమర్ నాథ్ లాంటి పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. రాయుడి అనుభవం, ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడారు.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ లో నాలుగో స్థానంలో రాయుడిని మించిన ఆటగాడు లేడంటూ కెప్టెన్ విరాట్ కొహ్లీ పలు సందర్భాలలో చెబుతూ వచ్చాడు.

అయితే…యువఆటగాళ్లు శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ , మనీశ్ పాండే లాంటి వారికీ…రెండో డౌన్ స్థానంలో తగిన అవకాశాలు ఇచ్చి చూసినా…రాయుడి ముందు తేలిపోయారు.

దీంతో …2019 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో అంబటి రాయుడికి చోటు పక్కా అని తేలిపోయింది. ప్రపంచకప్ జట్టులో రాయుడి బెర్త్ పై కొనసాగుతూ వచ్చిన సస్పెన్స్ ఒక్కసారిగా వీడిపోయింది.

ప్రపంచకప్ కు ముందు జరిగే సన్నాహక సిరీస్ లు, మ్యాచ్ ల్లో సైతం రాయుడు పూర్తిస్థాయిలో రాణించగలిగితే..రాయుడికి ఇక తిరుగే ఉండబోదు.

First Published:  6 Feb 2019 2:33 AM GMT
Next Story