Telugu Global
National

నాకు చెప్పకుండానే నన్ను కన్నారు.... తల్లిదండ్రులపై కేసు వేయబోతున్న కొడుకు !

శీర్షిక చూసి ఆశ్చర్యపోవద్దు. అది 100 శాతం పూర్తిగా నిజం. నాకు చెప్పకుండా, నన్ను సంప్రదించకుండా మా తల్లిదండ్రులు నన్ను కన్నారని చెబుతూ ఒక వ్యక్తి కోర్టులో కేసు వేయడానికి సిద్దపడ్డాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన జరిగింది ఏ పాశ్చాత్య దేశంలోనో.. మరో విదేశంలోనో కాదు. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకున్న వింత కేసు ఇది. ముంబైకి చెందిన 27 ఏళ్ల రాఫేల్ […]

నాకు చెప్పకుండానే నన్ను కన్నారు.... తల్లిదండ్రులపై కేసు వేయబోతున్న కొడుకు !
X

శీర్షిక చూసి ఆశ్చర్యపోవద్దు. అది 100 శాతం పూర్తిగా నిజం. నాకు చెప్పకుండా, నన్ను సంప్రదించకుండా మా తల్లిదండ్రులు నన్ను కన్నారని చెబుతూ ఒక వ్యక్తి కోర్టులో కేసు వేయడానికి సిద్దపడ్డాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన జరిగింది ఏ పాశ్చాత్య దేశంలోనో.. మరో విదేశంలోనో కాదు. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకున్న వింత కేసు ఇది.

ముంబైకి చెందిన 27 ఏళ్ల రాఫేల్ సామ్యుల్ ఒక యాంటీ నటలిస్ట్. నటలిస్ట్ అంటే సహజ సిద్దంగా పిల్లలకు జన్మనివ్వడం అనేది తప్పుడు వ్యవహారమని…. దీని ద్వారా జనాభా పెరిగి భూమికి భారమవుతారని ఒక తాత్విక భావన. యాంటీ నటలిస్ట్‌గా పేరు గాంచిన రాఫేల్ సామ్యుల్ ఇంకా ఏమంటాడంటే.. పిల్లలను వారి సంతోషం, సుఖం కోసం కంటారు. కాని వాళ్లు భూమిపైకి వచ్చాక మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కుంటారు. అలా వారికి బాధలు రావడానికి కారణం తల్లిదండ్రులు పిల్లల్ని కనడం వల్లే కదా అని వాదిస్తున్నాడు.

అసలు నేనెందుకు భూమి పైకి రావాలి..? నేనెందుకు పని చేయాలి..? నేనెందుకు బాధపడాలి? అని సామ్యుల్ ప్రశ్నిస్తున్నాడు. ఇదంతా నా తల్లిదండ్రుల శృంగార సుఖం వల్లే కదా అంటున్నాడు. ఆయన ఫేస్‌బుక్ పేజీలో ఇలాంటి పోస్టులు చాలా ఉన్నాయి.

అయితే ఈ విషయంపై అతని తల్లి కవిత సామ్యుల్ కూడా స్పందించారు. ఈ విషయాన్ని రాఫెల్ స్వయంగా పంచుకున్నాడు.

కవిత ఏం అంటుందంటే.. నా కుమారుడు ఈ మధ్య సృష్టించిన గందరగోళం అందరికీ తెలిసిందే.. అయితే నేను ఒకటి అడగదలుచుకున్నాను. నీ తల్లిదండ్రులు ఇద్దరూ లాయర్లని తెలిసి నువ్వు కోర్టులో కేసు వేశావా..? సరే, నిన్ను కనడానికి ముందు ఎలా చెప్పాలో, ఎలా సంప్రదించాలో చెప్పు అప్పుడు మాదే తప్పని ఒప్పుకుంటాం.

ఇక చివరిగా.. నా కుమారుడు చాలా సున్నిత మనస్కుడు. పెరిగే పిల్లలలో ఇలాంటి భావాలు రావడం సహజం. అయితే నా కుమారుడు తన మనసులోని భావాలను బయటకు వ్యక్తీకరించడం అతనిలోని స్వతంత్రుడిని, భయం లేని తనాన్ని సూచిస్తుందన్నారు.

సామ్యుల్ పెట్టిన ఈ పోస్టుపై పలువురు తీవ్రంగా విభేదిస్తూ పోస్టులు పెడుతున్నా.. తన యాంటీ నటలిజం గురించి మాత్రం బోధిస్తూనే ఉన్నాడు.

First Published:  6 Feb 2019 7:00 AM GMT
Next Story