Telugu Global
NEWS

శిఖా ప్రమేయం ఉంది... ఏపీ పోలీసులపై నమ్మకం లేదు...

తన భర్త హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని పారిశ్రామికవేత్త జయరాం భార్య పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని ఆమె చెప్పారు. ఏపీ పోలీసులు రోజుకో కథ అల్లుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఒక సారి విషం ఇచ్చి చంపారని చెప్పడం, మరోసారి కొట్టి చంపారనడం, ఆ తర్వాత బీరు సీసా కథ చెప్పడం బట్టి చూస్తుంటే ఏపీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉందన్నారు. తన భర్త హత్య […]

శిఖా ప్రమేయం ఉంది... ఏపీ పోలీసులపై నమ్మకం లేదు...
X

తన భర్త హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని పారిశ్రామికవేత్త జయరాం భార్య పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని ఆమె చెప్పారు.

ఏపీ పోలీసులు రోజుకో కథ అల్లుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఒక సారి విషం ఇచ్చి చంపారని చెప్పడం, మరోసారి కొట్టి చంపారనడం, ఆ తర్వాత బీరు సీసా కథ చెప్పడం బట్టి చూస్తుంటే ఏపీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉందన్నారు.

తన భర్త హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉందని… అయినా ఆమెను తప్పించేందుకు ఏపీలో కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన భర్త పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వాల్సిందిగా నాలుగు రోజులుగా కోరుతున్నా నందిగామ పోలీసులు ఇవ్వడంలేదని పద్మశ్రీ ఆవేదన చెందారు. హత్య జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగినందున కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని ఆమె కోరారు.

మేనమామ జయరాం చనిపోయారని తెలిసిన తర్వాత శిఖా చౌదరి తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడడం , విలువైన వస్తువులు తీసుకెళ్లడం మరిన్ని అనుమానాలు కలిగిస్తోందన్నారు.

ఈ నేపథ్యంలో పద్మశ్రీ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మశ్రీ ఫిర్యాదును తీసుకున్నామని… ఉన్నతాధికారుల నుంచి సలహాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని సీఐ శ్రీహరిచంద్రారెడ్డి చెప్పారు.

First Published:  5 Feb 2019 8:16 PM GMT
Next Story