Telugu Global
Cinema & Entertainment

నితిన్ సినిమాని ఆపేసిన అల్లు అరవింద్

నితిన్ “శ్రీనివాస కల్యాణం” ప్లాప్ తరువాత ఇంకా ఏ సినిమా స్టార్ట్ చేయలేదు. కానీ “కుమారి 21ఎఫ్” ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వచ్చింది. ఈ సినిమాని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడని కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయ్యిందట. ఎందుకంటే అల్లు అరవింద్ కు కథ , కథనం నచ్చకపోవడంతోనే సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమా ఆగిపోతుంది. అయితే […]

నితిన్ సినిమాని ఆపేసిన అల్లు అరవింద్
X

నితిన్ “శ్రీనివాస కల్యాణం” ప్లాప్ తరువాత ఇంకా ఏ సినిమా స్టార్ట్ చేయలేదు. కానీ “కుమారి 21ఎఫ్” ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వచ్చింది. ఈ సినిమాని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడని కూడా తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయ్యిందట. ఎందుకంటే అల్లు అరవింద్ కు కథ , కథనం నచ్చకపోవడంతోనే సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమా ఆగిపోతుంది. అయితే ఈ కథ సుకుమార్ కు, సూర్యప్రతాప్ కు, నితిన్ కు నచ్చిందట. కానీ అల్లు అరవింద్ కు నచ్చలేదు. డబ్బులు పెట్టేది నిర్మాత కాబట్టి అలా తప్పుకున్నాడు.

అందుకే ఇప్పుడు ఈ సినిమాని సుకుమార్ సొంతంగా నిర్మించాలని చూస్తున్నాడట. ఇంతకు ముందు ఇదే కథని రాజ్ తరుణ్ ని హీరోగా పెట్టి చేయాలని సుకుమార్ భావించాడు. కానీ అక్కడ వర్క్ ఔట్ అవ్వకపోయే సరికి ఈ సినిమా ఇప్పుడు నితిన్ కి వచ్చింది.

First Published:  6 Feb 2019 6:14 AM GMT
Next Story