Telugu Global
Others

వంశపారంపర్యం ప్రజాస్వామ్యానికి చేటు 

రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబానికి చెందిన వారు (ప్రధానంగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు) ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశించినప్పుడల్లా వంశపారంపర్య రాజకీయాలపై వాదవివాదాలు చెలరేగుతాయి. ఇటీవల ప్రియాంకా గాంధీ వాద్రాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి బాధ్యురాలిగా నియమించిన తర్వాత ప్రధానమంత్రితో సహా బీజేపీ నాయకులు అనేక మంది మళ్లీ ఈ వివాదం లేవనత్తడంలో కొత్తేమీ లేదు. పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన వారు రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడల్లా  వివాదం చెలరేగడం పరిపాటే. ఈ […]

వంశపారంపర్యం ప్రజాస్వామ్యానికి చేటు 
X

రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబానికి చెందిన వారు (ప్రధానంగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు) ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశించినప్పుడల్లా వంశపారంపర్య రాజకీయాలపై వాదవివాదాలు చెలరేగుతాయి. ఇటీవల ప్రియాంకా గాంధీ వాద్రాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి బాధ్యురాలిగా నియమించిన తర్వాత ప్రధానమంత్రితో సహా బీజేపీ నాయకులు అనేక మంది మళ్లీ ఈ వివాదం లేవనత్తడంలో కొత్తేమీ లేదు. పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన వారు రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడల్లా వివాదం చెలరేగడం పరిపాటే.

ఈ వివాదాల్లో సమానత్వంతో కూడిన ప్రజాస్వామ్యం కొనసాగాలన్న అంశం ఉన్నా దొంగ చాటుగా విమర్శలు చేయడంవల్ల వాదవివాదాలు ఆ రొదలో వినిపించకుండా పోతాయి. ప్రియాంకా గాంధీ రాజకీయ రంగ ప్రవేశంపై విమర్శలు గుప్పించిన బీజేపీ అధికార ప్రతినిధి తమ పార్టీలో ఇలాంటివి లేనేలేవన్నట్టుగా మాట్లాడతారు.

వంశపారంపర్య ధోరణి ప్రజాస్వామ్యానికి కీడు చేస్తుందంటారు. కానీ బీజేపీలో ఉన్న వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికి విరోధాబాసగానే ఉంటాయి. కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని వాదించే వారు తమ పార్టీలోనూ అవే ఎందుకున్నాయో మాత్రం చెప్పరు. తమ వంశపారంపర్య రాజకీయాలు కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలకన్నా ఎందుకు గొప్పవో చెప్పరు.

బీజేపీ వాదన కపటంతో కూడుకున్నదే కాదు, అనాలోచితమైంది కూడా. వంశపారంపర్య రాజకీయాలవల్ల కలిగే ప్రతికూలత ఏమిటో చెప్పకపోగా ద్వంద్వ విధానాలు అనుసరించడానికే ఉపయోగపడుతుంది.

వివేకంగల వ్యక్తులైన పౌరులు యథాతథ వాదులతో భిన్నంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి సమానత్వ లక్షణం ఉంటుంది. పౌరుడు ప్రజాప్రయోజనం కోసం కట్టుబడ్డప్పుడు లేదా వివేకం గల పౌరుడు ప్రజా జీవనంలో ప్రవేశిస్తే, ప్రజా ప్రయోజనం కోసం పాటుబడితే కులం, మతం, స్త్రీ పురుష తేడాలు లెక్క చేయడు. కుటుంబం మీద ఆధార పడడు. కుటుంబం మీద ఆధారపడే వారికైతే ఆ కుటుంబానికి ఉన్న పలుకుబడి, సంపద, రాజకీయ సంబంధాలు, పార్టీ కార్యకర్తల అండ సమకూరతాయి. స్వయం శక్తి మీద ఆధారపడే వారికి కుటుంబం దన్ను భారంగా మారుతుంది.

ప్రత్యర్థులను విమర్శించడానికి వంశపారంపర్య రాజకీయాలు అని నిందించడంవల్ల ఉపయోగం లేదు. సమర్థుడైన వ్యక్తి కుటుంబం దన్ను వదిలేసి పోటీ తత్వం గల రాజకీయాలలో నెగ్గుకు రావడానికి ఉపకరించవచ్చునేమో కాని అది సాధ్యమయ్యే పని కాదు.

సమకాలీన రాజకీయాలలో ప్రత్యేకమైన కుటుంబాలకు చెందిన వారు విజయవంతం కావడానికి వీలుంటుంది. ఆ కుటుంబాలు, లేదా ఆ కుటుంబ బంధువులకు నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నికల మీద ఆధారపడిన ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక అవకాశం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు పార్టీ పదవులు కట్టబెట్టడం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కుటుంబాలకు చెందిన వారికి చట్ట సభల సభ్యుల మీద కూడా ఆజమాయిషీ చెలాయించే అవకాశం ఉంటుంది. చట్టసభల సభ్యులు తమ ఆదేశాలు పాటించకపోతే మందలిస్తారు. లేదా వారికి పార్టీ పదవులు ఇవ్వకుండా అడ్డుపడగలరు. లేదా ప్రభుత్వ వ్యవస్థల్లో అవకాశం లేకుండా చేయగలరు.

ఇది బిలియర్డ్స్ ఆటలో బంతిని కన్నంలో వేయడానికి ఉపయోగించే కర్ర లాంటిది. అధికారం ఊరికే దక్కదు. కుటుంబంపట్ల విశ్వాస పాత్రంగా ఉండేవారికే అధికారం దక్కుతుంది. ఇది మరో రకమైన రాచరిక వ్యవస్థ. వైపరీత్యం ఏమిటంటే వంశపారంపర్య రాజకీయాలవల్ల నష్టపోయిన వారూ ఇదే పద్ధతిని అనుసరిస్తుంటారు. కొన్ని దళిత, ఆదివాసీ కుటుంబాలు వంశపారంపర్య విధానాన్ని అనుసరిస్తుంటాయి. వారి కుటుంబం నుంచే వారసులను ఎంపిక చేస్తుంటారు.

కొన్ని దళిత, ఆదివాసీ కుటుంబాలు ఈ పద్ధతి అనుసరించడం, కుటుంబం పలుకుబడిపై ఆధారపడడం, రాజకీయ అధికారం సంపాదించడం చూస్తూనే ఉంటాం. దీని మూలాలు ప్రజాస్వామ్యం కన్నా ముందున్న సమాజాల నుంచి వచ్చినవే. అలాంటి కుటుంబాలలో వంశపారంపర్య నియమాన్నే పాటిస్తారు. తదుపరి అధికారం ఎవరిదో ముందే నిర్ణయం అయిపోతుంది. ఆ కుటుంబంపట్ల విశ్వాస పాత్రులుగా ఉండే వారు ఈ పద్ధతిని ఆచరిస్తూనే ఉంటారు. అంగీకరిస్తూనే ఉంటారు. ఇది ప్రజాస్వామ్యంలో వైపరీత్యమే.

అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామీకరించడానికి ఈ పద్ధతిని ఎలా విడనాడాలి? ఈ రుగ్మతను దూరం చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలలో మహిళలను సాధికారులను చేసే ప్రయత్నం జరిగింది. అయినా పితృస్వామిక భావజాలం ఉన్న కుటుంబాలు కుటుంబ ఆధిపత్యం కొనసాగడానికి మార్గాలు వెతుకుతూనే ఉంటాయి.

అరిస్టాటిల్ ప్రజాస్వామ్య నైతిక సూత్రాల ప్రకారం కూడా “నేను పరిపాలిస్తాను, పాలనకు గురవుతాను” అన్న విధానం ఉంది. అలాంటప్పుడు ఈ కుటుంబాలకు చెందిన వారు తమ ఆధిపత్యం వదులుకోరు. అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించరు. అలాంటి కుటుంబాలు వంశపారంపర్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. అలాంటి వారు ఇతరుల పరిపాలనను అంగీకరించడానికి సిద్ధ పడరు.

ఇలాంటి స్థితిలోనే సాధారణ ఓటర్లు విజ్ఞతతో ప్రవర్తిస్తే సమానత్వం, న్యాయం అన్న సూత్రాలకు కట్టుబడి ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే వంశపారంపర్య విధానం బలహీన పడుతుంది.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  5 Feb 2019 6:03 PM GMT
Next Story