Telugu Global
Cinema & Entertainment

మళ్ళీ సమంత తో బెల్లంకొండ?

ప్రొడ్యూసర్ కొడుగ్గా ఇండస్ట్రీ కి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్…. ఇప్పటి వరకు అన్నీ భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటించాడు. తొలి సినిమా “అల్లుడు శ్రీను” లోనే సమంత వంటి స్టార్ హీరోయిన్ తో నటించిన ఈ హీరో ఆ తరువాత వరుసగా కాజల్ అగర్వాల్, తమన్నా, పూజ హెగ్డే…. ఇలా స్టార్ హీరోయిన్లతో నటించాడు. ఇక ప్రస్తుతం వరుస ప్లాప్స్ లో ఉన్న ఈ హీరో ఇప్పుడు ఆర్ ఎక్స్ 100′ ఫేమ్ అజయ్ భూపతి […]

మళ్ళీ సమంత తో బెల్లంకొండ?
X

ప్రొడ్యూసర్ కొడుగ్గా ఇండస్ట్రీ కి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్…. ఇప్పటి వరకు అన్నీ భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటించాడు. తొలి సినిమా “అల్లుడు శ్రీను” లోనే సమంత వంటి స్టార్ హీరోయిన్ తో నటించిన ఈ హీరో ఆ తరువాత వరుసగా కాజల్ అగర్వాల్, తమన్నా, పూజ హెగ్డే…. ఇలా స్టార్ హీరోయిన్లతో నటించాడు.

ఇక ప్రస్తుతం వరుస ప్లాప్స్ లో ఉన్న ఈ హీరో ఇప్పుడు ఆర్ ఎక్స్ 100′ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఎప్పటిలాగానే స్టార్ హీరోయిన్ల వేట మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు.

ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడట డైరెక్టర్ అజయ్. అయితే పెళ్లయిన తర్వాత సమంత కమర్షియల్ సినిమాల్లో కాకుండా కొత్తదనం ఉన్న సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించడానికి సమంత ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

First Published:  6 Feb 2019 6:55 AM GMT
Next Story