నటి ఝాన్సీ ఆత్మహత్మ

ప్రముఖ టీవీ సీనియర్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్‌ కాలనీలో తన తల్లిదండ్రులతో కలిసి ఝాన్సీ నివాసముంటున్నారు. కొంతకాలంగా సూర్య అనే వ్యక్తితో ఝాన్సీ సహజీవనం చేస్తోంది. ఇటీవల ఝాన్సీ పెళ్లి ప్రతిపాదన తెచ్చింది. అప్పటి నుంచి ఆమెను సూర్య దూరంగా ఉంచుతున్నాడు.

ఈ విషయంలో రాత్రి తల్లిదండ్రులతో ఝాన్సీ గొడవపడ్డారు. అనంతరం ఆత్మహత్య చేసుకుంది. ఝాన్సీ పవిత్రబంధం సీరియల్‌లో నటించింది. ప్రేమికుడు సూర్య కోసం ఝాన్సీ నటనకు కూడా ఇటీవల దూరంగా ఉంటున్నారు.