Telugu Global
Cinema & Entertainment

మజిలీకి రూ.6 కోట్లు ఆఫర్

నాగచైతన్య-సమంత జోడీకి సిల్వర్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘ఏమాయ చేశావే’ సినిమా సూపర్ హిట్ అయింది. ‘మనం’ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆటోనగర్ సూర్య ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఈ జంటపై పడలేదు. ఇప్పుడు మరోసారి ఈ రియల్ లైఫ్ దంపతులు కలిసి నటిస్తున్నారు. అందుకే మజిలీ సినిమా మార్కెట్లో హాట్ కేక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా శాటిలైట్ […]

మజిలీకి రూ.6 కోట్లు ఆఫర్
X

నాగచైతన్య-సమంత జోడీకి సిల్వర్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘ఏమాయ చేశావే’ సినిమా సూపర్ హిట్ అయింది. ‘మనం’ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆటోనగర్ సూర్య ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఈ జంటపై పడలేదు. ఇప్పుడు మరోసారి ఈ రియల్ లైఫ్ దంపతులు కలిసి నటిస్తున్నారు. అందుకే మజిలీ సినిమా మార్కెట్లో హాట్ కేక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా సవ్యసాచి రూపంలో భారీ ఫ్లాప్ వచ్చినప్పటికీ చైతూ నటిస్తున్న మజిలీ సినిమాకు ఇంత రేటు పలకడం నిజంగా గ్రేట్. కేవలం సమంత ఉండడం వల్లనే ఇంత మొత్తం వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది మజిలీ సినిమా. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాల నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.

First Published:  6 Feb 2019 8:59 PM GMT
Next Story