Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్-మహానాయకుడు" లో బాలక్రిష్ణ ఆ పాత్రని చెయ్యట్లేదట

“ఎన్టీఆర్” బయోపిక్ మొదటి భాగం “ఎన్టీఆర్-కథానాయకుడు” ఫ్లాప్ అవ్వడం తో నందమూరి బాలక్రిష్ణ ఇప్పుడు ఈ సినిమా రెండో భాగమ పై ఎక్కవ శ్రద్ధ పెడుతున్నాడు. ఇప్పటికే రెండో పార్ట్ షూటింగ్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న బాలక్రిష్ణ ఈ సినిమాలో తన తండ్రి యువకుడి పాత్ర కోసం వేరే కొత్త నటుడిని తీసుకోవాలి అనుకుంటున్నాడట. “ఎన్టీఆర్” మొదటి భాగంలో ఎన్టీఆర్ యువకుడిగా కనిపించే పాత్రలో బాలయ్య అస్సలు సూట్ అవ్వలేదు అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. […]

ఎన్టీఆర్-మహానాయకుడు లో బాలక్రిష్ణ ఆ పాత్రని చెయ్యట్లేదట
X

“ఎన్టీఆర్” బయోపిక్ మొదటి భాగం “ఎన్టీఆర్-కథానాయకుడు” ఫ్లాప్ అవ్వడం తో నందమూరి బాలక్రిష్ణ ఇప్పుడు ఈ సినిమా రెండో భాగమ పై ఎక్కవ శ్రద్ధ పెడుతున్నాడు.

ఇప్పటికే రెండో పార్ట్ షూటింగ్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న బాలక్రిష్ణ ఈ సినిమాలో తన తండ్రి యువకుడి పాత్ర కోసం వేరే కొత్త నటుడిని తీసుకోవాలి అనుకుంటున్నాడట.

“ఎన్టీఆర్” మొదటి భాగంలో ఎన్టీఆర్ యువకుడిగా కనిపించే పాత్రలో బాలయ్య అస్సలు సూట్ అవ్వలేదు అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ సినిమాలో ఈ తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని బాలక్రిష్ణ ట్రై చేస్తున్నాడు.

“ఎన్టీఆర్-మహానాయకుడు” సినిమాలో ముఖ్యంగా…. ఎన్టీఆర్ రాజకీయ జీవితం పైన దృష్టి పెట్టినప్పటికీ ఈ సినిమాలో కూడా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఉన్నాయట. అందులో ఎన్టీఆర్ కాలేజీ రోజులు మరియు బసవతారకంతో వివాహం…. ఇలాంటి సన్నివేశాలలో ఎన్టీఆర్ పాత్రలో యువ నటుడిని తీసుకున్నట్టు సమాచారం.

మరి ఆ నటుడు ఎవరు? రెండో భాగంలో ఆ క్యారెక్టర్ ను…. బాలక్రిష్ణ, క్రిష్ ఎలా కవర్ చేయబోతున్నారు అనేది తెలియాలి.

First Published:  7 Feb 2019 6:47 AM GMT
Next Story