Telugu Global
Cinema & Entertainment

ఇప్పుడు ఇలా దొరికిపోయిన ప్రియాంక

36ఏళ్ల వ‌య‌సులో మిస‌మిస‌లాడే అందంతో ప్రియాంక చోప్రా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ గా రాణిస్తోంది. గ‌త ఏడాది నిక్ జోన‌స్ ను వివాహం చేసుకున్న ప్రియాంక అటు హాలీవుడ్ , ఇటు బాలీవుడ్ చిత్రాల్లో రాణిస్తోంది. ఈ నేప‌థ్యంలో హాలీవుడ్ కు చెందిన క‌మెడియ‌న్ జిమ్మీ ఫాలెస్ నిర్వ‌హించే టాక్ షోలో పాల్గొంది. అయితే ఆ షోలో ఎప్ప‌టిలాగే హాట్ హాట్ అందాల‌తో అభిమానుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. అంతే దీంతో చిర్రెత్తిపోయిన అభిమానులు ట్రోల్ చేసిప‌డేశారు. బ్రా లెస్ తో […]

ఇప్పుడు ఇలా దొరికిపోయిన ప్రియాంక
X

36ఏళ్ల వ‌య‌సులో మిస‌మిస‌లాడే అందంతో ప్రియాంక చోప్రా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ గా రాణిస్తోంది. గ‌త ఏడాది నిక్ జోన‌స్ ను వివాహం చేసుకున్న ప్రియాంక అటు హాలీవుడ్ , ఇటు బాలీవుడ్ చిత్రాల్లో రాణిస్తోంది.

ఈ నేప‌థ్యంలో హాలీవుడ్ కు చెందిన క‌మెడియ‌న్ జిమ్మీ ఫాలెస్ నిర్వ‌హించే టాక్ షోలో పాల్గొంది. అయితే ఆ షోలో ఎప్ప‌టిలాగే హాట్ హాట్ అందాల‌తో అభిమానుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చింది. అంతే దీంతో చిర్రెత్తిపోయిన అభిమానులు ట్రోల్ చేసిప‌డేశారు.

బ్రా లెస్ తో టాక్ షోలో పాల్గొన‌డంపై మండిప‌డ్డారు. ఇంత ఇబ్బంది కరంగా డ్రెస్ వేసుకోవలసిన అవసరం ఏంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరో మారు ప్రియాంక చోప్రా తన క్లివేజ్ షోతో మతులు పోగొడుతోంది.

అయితే సరదాగా సాగిన ఈషోలో క‌మెడియ‌న్ జిమ్మీ ఫాలెన్…. ప్రియాంక చోప్రా – నిక్ జోన‌స్ ఒడిలో నిద్రిస్తున్న ఫోటోల‌పై ప్ర‌శ్న‌లు సంధించారు. ఇప్ప‌టికే ఆ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ కావ‌డంతో బెడ్ రూం ల‌లో కూడా కెమెరాలు పెట్టుకుంటారా? అంటూ ఆమె అభిమానులు సెటైర్లు వేశారు. ఆ ఫోటో వెనుక ఉన్న ర‌హ‌స్యాన్ని టాక్ షోలో భ‌య‌ట‌పెట్టింది.

తాను జోన‌స్ ఒడిలో నిద్రిస్తుంటే..అత‌ను మాత్రం టీవీ చూస్తున్నాడు. అదే స‌మ‌యంలో మా కజిన్ ఈ ఫోటో తీసింది అంటూ ఆ మిస్టరీ ఫోటో సీక్రెట్ రివీల్ చేసింది.

First Published:  7 Feb 2019 3:40 AM GMT
Next Story