Telugu Global
Cinema & Entertainment

పూరి జగన్నాథ్ కి షరతు పెట్టిన రామ్?

గత కొంతకాలంగా హీరో రామ్ నటించిన ఒక్క సినిమా కూడా పెద్ద హిట్ అవ్వలేదు. ఈ మధ్యనే రామ్ హీరోగా తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేదు. అయితే ప్రస్తుతం తన ఆశలన్నీ ‘ఇస్మార్ట్ శంకర్’ పైనే పెట్టుకున్నాడు రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను పూరి కనెక్ట్స్ పతాకంపై చార్మి నిర్మిస్తుండగా పూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ మార్కెట్ బాగా […]

పూరి జగన్నాథ్ కి షరతు పెట్టిన రామ్?
X

గత కొంతకాలంగా హీరో రామ్ నటించిన ఒక్క సినిమా కూడా పెద్ద హిట్ అవ్వలేదు. ఈ మధ్యనే రామ్ హీరోగా తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేదు. అయితే ప్రస్తుతం తన ఆశలన్నీ ‘ఇస్మార్ట్ శంకర్’ పైనే పెట్టుకున్నాడు రామ్.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను పూరి కనెక్ట్స్ పతాకంపై చార్మి నిర్మిస్తుండగా పూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ మార్కెట్ బాగా పడిపోయింది. మరోవైపు పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. అందువల్ల రామ్ ఈ సినిమా కోసం తన పారితోషకాన్ని తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.

మామూలుగా ప్రతి సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే రామ్ ఇందులో సగం మాత్రమే కోరాడట. కానీ ఇక్కడ ఒక షరతు కూడా పెట్టాడట రామ్. సినిమా క్వాలిటీ చాలా బాగుండాలని రామ్ కండిషన్.

అయితే ఈ సినిమాకి కనుక హిట్ టాక్ వస్తే రామ్ కు పూర్తి స్థాయిలో రెమ్యూనరేషన్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

First Published:  7 Feb 2019 12:47 AM GMT
Next Story