Telugu Global
Cinema & Entertainment

బాలయ్య-రకుల్ కాంబినేషన్ మరోసారి.... కారణం అదే....

ఈమెకు అవకాశాల్లేవు. అతడికి హీరోయిన్లు దొరకడం లేదు. ఇంకేముంది మరోసారి కలిశారు. అవును.. బాలయ్య-రకుల్ కాంబినేషన్ మరోసారి ఫిక్స్ అయింది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న బోయపాటి సినిమాలో రకుల్ ను దాదాపు హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టే. బాలయ్య తాజాగా నటించిన ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో ఓ చిన్న వేషం వేసింది రకుల్ ప్రీత్. అందులో శ్రీదేవి పాత్రలో ఆమె మెరిసింది. ఓ పాటతో పాటు ఓ చిన్న సీన్ కూడా పెట్టారు. అప్పుడే బాలయ్య-రకుల్ మధ్య […]

బాలయ్య-రకుల్ కాంబినేషన్ మరోసారి.... కారణం అదే....
X

ఈమెకు అవకాశాల్లేవు. అతడికి హీరోయిన్లు దొరకడం లేదు. ఇంకేముంది మరోసారి కలిశారు. అవును.. బాలయ్య-రకుల్ కాంబినేషన్ మరోసారి ఫిక్స్ అయింది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న బోయపాటి సినిమాలో రకుల్ ను దాదాపు హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టే.

బాలయ్య తాజాగా నటించిన ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో ఓ చిన్న వేషం వేసింది రకుల్ ప్రీత్. అందులో శ్రీదేవి పాత్రలో ఆమె మెరిసింది. ఓ పాటతో పాటు ఓ చిన్న సీన్ కూడా పెట్టారు. అప్పుడే బాలయ్య-రకుల్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఇప్పుడు ఆమెకు వరుసగా మరో ఛాన్స్ వచ్చేలా చేసింది.

అటు బాలయ్యను డైరక్ట్ చేయబోతున్న బోయపాటికి కూడా రకుల్ చాలా క్లోజ్. గతంలో జయజానకి నాయక, సరైనోడు సినిమాలకు వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేశారు. అందుకే తన నెక్ట్స్ మూవీలో కూడా రకుల్ కే ఛాన్స్ ఇచ్చాడు బోయపాటి. త్వరలోనే బోయపాటి-బాలయ్య ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.

First Published:  7 Feb 2019 12:59 AM GMT
Next Story