Telugu Global
NEWS

ఈ పిచ్చి ఏపీలో త‌ప్ప వెనుక‌బ‌డిన దేశాల్లో కూడా లేదు " మాజీ సీఎస్‌

30ఏళ్లుగా ఆంధ్రప్ర‌దేశ్‌ను ప‌ట్టి పీడిస్తున్న వాటిలో సినిమా పిచ్చి కూడా ఒక‌ట‌ని అభిప్రాయ‌ప‌డ్డారు మాజీ సీఎస్ అజయ్ క‌ల్లం. విశాఖ‌లో జ‌రిగిన ”సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌- సేవ్ డెమోక్ర‌సి” కార్య‌క్ర‌మంలో మాట్లాడిన అజ‌య్ క‌ల్లం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను 30 ఏళ్లుగా సినిమా పిచ్చి కూడా వేధిస్తోంద‌న్నారు. ఒక‌ప్పుడు త‌మిళ‌నాడుకే ప‌రిమిత‌మైన ఈ పిచ్చి ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను వేధిస్తోంద‌న్నారు. ఇలాంటి సినిమా పిచ్చి ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌న్నారు. మ‌న కంటే వెనుక‌బ‌డి ఉన్న నార్త్ ఇండియాలో కూడా ఇంత సినిమా పిచ్చి లేద‌న్నారు. ప్ర‌పంచంలో ఏ దేశంలో చూసినా సినిమాను సినిమాగా, […]

ఈ పిచ్చి ఏపీలో త‌ప్ప వెనుక‌బ‌డిన దేశాల్లో కూడా లేదు  మాజీ సీఎస్‌
X

30ఏళ్లుగా ఆంధ్రప్ర‌దేశ్‌ను ప‌ట్టి పీడిస్తున్న వాటిలో సినిమా పిచ్చి కూడా ఒక‌ట‌ని అభిప్రాయ‌ప‌డ్డారు మాజీ సీఎస్ అజయ్ క‌ల్లం. విశాఖ‌లో జ‌రిగిన ”సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌- సేవ్ డెమోక్ర‌సి” కార్య‌క్ర‌మంలో మాట్లాడిన అజ‌య్ క‌ల్లం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను 30 ఏళ్లుగా సినిమా పిచ్చి కూడా వేధిస్తోంద‌న్నారు. ఒక‌ప్పుడు త‌మిళ‌నాడుకే ప‌రిమిత‌మైన ఈ పిచ్చి ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను వేధిస్తోంద‌న్నారు.

ఇలాంటి సినిమా పిచ్చి ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌న్నారు. మ‌న కంటే వెనుక‌బ‌డి ఉన్న నార్త్ ఇండియాలో కూడా ఇంత సినిమా పిచ్చి లేద‌న్నారు. ప్ర‌పంచంలో ఏ దేశంలో చూసినా సినిమాను సినిమాగా, సినిమా హీరోను న‌టుడిగానే చూస్తార‌న్నారు.

స‌మాజం కోసం త్యాగాలు చేసిన వారో, జ‌నం కోసం ఆస్తులు పొగొట్టుకున్న వారో హీరోలు అవుతారు గానీ ప్రేక్ష‌కుల ముందు న‌టిస్తూ డ‌బ్బు సంపాదించే న‌టులు రియ‌ల్ హీరోలు ఎలా అవుతార‌ని అజ‌య్ ప్ర‌శ్నించారు.

బ్రిటిష్ వాళ్ల‌తో పోరాటం చేసిన అల్లూరి సీతారామ‌రాజు, ఆస్తులు స్వాతంత్ర ఉద్య‌మం కోసం రాసిచ్చిన టంగుటూరి ప్ర‌కాశం పంతులు, పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య‌, జ‌మిందారి కుటుంబంలో పుట్టినా ఆస్తులు వ‌దిలేసి స‌మాజం కోసం తుపాకీ ప‌ట్టి పోరాటం చేసిన త‌రిమెల నాగిరెడ్డి, ప్ర‌జా సేవలో నిజాయితీగా బ‌తికిన‌ దామోద‌ర సంజీవ‌య్య‌లాంటి వాళ్లు ఈ స‌మాజంలో నిజ‌మైన హీరోలు అని అజ‌య్ క‌ల్లాం అన్నారు.

దామోద‌ర సంజీవ‌య్య ముఖ్య‌మంత్రి అయ్యాక ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేసేందుకు ఒక జాతీయ చాన‌ల్ ప్ర‌తినిధులు వెతుకుతూ వ‌చ్చార‌ని… చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి కుటుంబం ఒక గుడిసెలో ఉంటుందని తెలుసుకుని మీడియా వాళ్లే
ఆశ్చ‌ర్య‌పోయార‌ని వివ‌రించారు. అలాంటి వారిని యువ‌త స్పూర్తిగా తీసుకోవాలి గానీ… సినిమాలు చూసి ఆయా న‌టుల‌ను స్పూర్తిగా తీసుకుంటే సాధించేది ఏమీ ఉండ‌ద‌న్నారు.

First Published:  8 Feb 2019 12:52 AM GMT
Next Story