అల్లు అర్జున్ కోసం నితిన్ కి నో చెప్పిన రష్మిక

“ఛలో” సినిమాతో హిట్ అందుకొని “గీత గోవిందం” తో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ రష్మిక. కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన ఈ భామ రెండు హిట్స్ తో తెలుగు లో వరుస అవకాశాలు సంపాదించుకుంది.

ఇక ఇప్పుడు ఈ భామకి అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఒక చలాకి అమ్మాయి పాత్ర కోసం రష్మిక ను తీసుకున్నాడట . గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , హారిక హాసిని క్రియేషన్స్ పై చిన్నబాబు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

రష్మిక ఈ సినిమా అయితే ఓకే చేసింది. కానీ ఈ సినిమా కోసం రష్మిక నితిన్ సినిమాకి నో చెప్పిందట. అల్లు అర్జున్ సినిమా ఆఫర్ రాకముందు రష్మిక నితిన్ సినిమా కి ఎస్ చెప్పింది. “ఛలో” ఫేం వెంకీ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. కానీ మధ్యలో అల్లు అర్జున్ సినిమా ఆఫర్ రావడంతో ఈ సినిమా వదిలేసి అల్లు అర్జున్ సినిమాకి ఓకే చెప్పిందట రష్మిక.