Telugu Global
National

12 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో చంద్ర‌బాబు దీక్ష‌ .... ప్ర‌త్యేక రైళ్లు, విమానాలు సిద్ధం

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మ‌రో భారీ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు. ఢిల్లీ వేదిక‌గా వ‌న్ డే దీక్ష‌కు సిద్ద‌మ‌వుతున్నారు. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఢిల్లీ వేదిక‌గా త‌న స‌త్తా చూపించాల‌నుకుంటున్నారు. ఇందులో భాగంగా రైళ్ల ద్వారా ప్ర‌జల‌ను త‌ర‌లించ‌నున్నారు. అనంత‌పురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను బుక్ చేశారు. ఇందు కోసం కోటి 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. నేత‌ల‌ను విమానాల ద్వారా త‌ర‌లించేందుకు, ఇత‌ర మార్గాల్లో ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించేందుకు రెండు కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. దీక్ష […]

12 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో చంద్ర‌బాబు దీక్ష‌ .... ప్ర‌త్యేక రైళ్లు, విమానాలు సిద్ధం
X

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మ‌రో భారీ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు. ఢిల్లీ వేదిక‌గా వ‌న్ డే దీక్ష‌కు సిద్ద‌మ‌వుతున్నారు. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఢిల్లీ వేదిక‌గా త‌న స‌త్తా చూపించాల‌నుకుంటున్నారు.

ఇందులో భాగంగా రైళ్ల ద్వారా ప్ర‌జల‌ను త‌ర‌లించ‌నున్నారు. అనంత‌పురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను బుక్ చేశారు. ఇందు కోసం కోటి 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. నేత‌ల‌ను విమానాల ద్వారా త‌ర‌లించేందుకు, ఇత‌ర మార్గాల్లో ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించేందుకు రెండు కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

దీక్ష రోజు ప్ర‌తి టీవీ చాన‌ల్ లోనూ, ప‌త్రిక‌ల్లోనూ త‌న కార్య‌క్ర‌మం గురించే ప్ర‌చారం జ‌రిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ దీక్ష
ప్ర‌చారం కోసం రూ. 8 కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్నారు. దీక్ష‌లో ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

ఉద్యోగుల‌ను దీక్ష‌కు త‌ర‌లించేలా ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు చంద్ర‌బాబు టార్గెట్లు ఫిక్స్ చేశారు. దీక్ష‌కు సంఘీభావం తెలిపేందుకు ప‌లువురు ఇత‌ర రాష్ట్రాల నాయ‌కుల‌ను టీడీపీ నేత‌లు ఆహ్వానిస్తున్నారు. ప్రియాంక గాంధీని ర‌ప్పించేందుకు టీడీపీ నేత‌లు ఆలోచ‌న చేస్తున్నారు.

First Published:  8 Feb 2019 2:12 AM GMT
Next Story