మారుతి తో సాయి ధరం తేజ్

అడల్ట్ సినిమాల నుంచి కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మారుతి. “భలే భలే మగాడివోయ్” సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతీ ఆ తరువాత శర్వానంద్ తో “మహానుభావుడు” తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాక మారుతీ…. అక్కినేని నాగ చైతన్య తో “శైలజా రెడ్డి అల్లుడు” సినిమాని డైరెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యింది.

ఇక ఆ తరువాత మారుతీ ఏ సినిమా చేయలేదు. ఫైనల్ గా సాయి ధరం తేజ్ మారుతీ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న సాయి ధరం తేజ్ కి ఒక సాలిడ్ హిట్ అవసరం. డైరెక్టర్ మారుతీ అయితే తనకి సాలిడ్ హిట్ ఇస్తాడు అని సాయి ధరం తేజ్ గట్టిగా నమ్ముతున్నాడు.

యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించబోతోంది. ఇదిలా ఉంటే సాయి ధరం తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న “చిత్రలహరి” షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.