Telugu Global
NEWS

చాలామంది అభ్యర్ధులను మార్చనున్న చంద్రబాబు

రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏం అంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు, బీసీ కులాలను తనవైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం తరపున నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కనుక మళ్లీ […]

చాలామంది అభ్యర్ధులను మార్చనున్న చంద్రబాబు
X

రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏం అంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు, బీసీ కులాలను తనవైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

దీంతో రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రభుత్వం తరపున నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కనుక మళ్లీ పోటీ చేస్తే సగానికి పైగా స్థానాలు దక్కే అవకాశం లేదని తేలింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను వారి వారి స్థానాల నుంచి మార్చి కొత్తవారిని ఎన్నికల బరిలోకి దింపాలని చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుల దగ్గర అన్నట్లు సమాచారం.

లోక్‌సభ సభ్యులుగా ఉన్న కొందరు ఈసారి శాసనసభకు పోటీ చేస్తామని చంద్రబాబును అడిగినట్లు చెబుతున్నారు. వీరిలో రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మురళీమోహన్, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని, విజయనగరం లోక్ సభ సభ్యుడు అశోక్ గజపతిరాజు, అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఉన్నారంటున్నారు. వీరే కాక పోయినసారి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళల్లో ఆదాల ప్రభాకర్‌ రెడ్డి లాంటి కొందరు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు.

వారిని శాసనసభకు పంపించి ఈ స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను లోక్‌సభ బరిలో దింపాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సగానికి పైగా ఈసారి టికెట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నారు. గత నెలరోజులుగా ఈ సీనియర్లతోనూ, ఎమ్మెల్యేలతోనూ విడివిడిగా చర్చలు జరుపుతున్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“ మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి. రెండు మూడు నెలలు బాగా పని చేస్తే ఉంటారు. లేదా మీ స్థానంలో మరొకరు వస్తారు” అని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో కొత్తవారితో తెలుగుదేశం పార్టీ ప్రయోగం చేయనుందని చెబుతున్నారు.

First Published:  8 Feb 2019 2:44 AM GMT
Next Story