మోక్షజ్ఞ స్థానంలో కన్నడ నటుడు

చాలామంది హీరోల్ని, హీరోయిన్లను, క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని పెట్టి ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాకు బాగానే బజ్ తీసుకురాగలిగారు. కానీ రెండో భాగం ఎన్టీఆర్-మహానాయకుడులో ఇలాంటి ప్యాడింగ్ లు పెట్టడానికి అవకాశం దక్కలేదు. పైగా ఫస్ట్ పార్ట్ డిజాస్టర్ అవ్వడంతో, రెండో భాగంపై పూర్తిగా అంచనాలు పడిపోయాయి. ఇలాంటి టైమ్ లో దొరికిన ఓ మంచి అవకాశాన్ని యూనిట్ చేజేతులా వదిలేసుకుంది.

పార్ట్-2 మహానాయకుడులో ఎన్టీఆర్ యంగేజ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. ఆ పాత్ర కోసం కన్నడ నటుడు తరుణ్ ను తీసుకున్నారట. నిజానికి ఇదే పాత్రలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞను నటింపజేస్తే సినిమాకు మంచి మైలేజీ వచ్చి ఉండేది. కానీ యూనిట్ ఆ దిశగా ఆలోచించలేదు.

నిజానికి ఈ ప్రాజెక్టులో మోక్షజ్ఞ కూడా ఉంటే బాగుంటుందని చాలామంది భావించారు. బాలయ్య కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేశాడు. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన మనం సినిమాతో అఖిల్ ఎంట్రీ ఇచ్చినట్టు, ఎన్టీఆర్ బయోపిక్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావించారు.

కానీ పార్ట్-1 డిజాస్టర్ అవ్వడంతో, పార్ట్-2తో మోక్షజ్ఞను తెరపైకి తీసుకొచ్చేందుకు బాలయ్యతో సహా అంతా భయపడుతున్నారు. అందుకే మోక్షజ్ఞ స్థానంలో కన్నడ నటుడు తరుణ్ ను ఎంపిక చేశారు.