Telugu Global
Cinema & Entertainment

రాజమౌళిని భయపెట్టిస్తున్న హీరోయిన్స్

“బాహుబలి” సినిమా తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ పై  భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కి ఇప్పటి వరకు కూడా హీరోయిన్స్ ని ఫిక్స్ చేయలేకపోయాడు జక్కన్న. దీనికి ఒక కారణం కూడా ఉందట. అదేంటంటే ఈ సినిమాలో నటించడానికి రాజమౌళికి ఒక స్టార్ బాలీవుడ్ హీరోయిన్ కావాలట. కానీ ఆ […]

రాజమౌళిని భయపెట్టిస్తున్న హీరోయిన్స్
X

“బాహుబలి” సినిమా తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కి ఇప్పటి వరకు కూడా హీరోయిన్స్ ని ఫిక్స్ చేయలేకపోయాడు జక్కన్న.

దీనికి ఒక కారణం కూడా ఉందట. అదేంటంటే ఈ సినిమాలో నటించడానికి రాజమౌళికి ఒక స్టార్ బాలీవుడ్ హీరోయిన్ కావాలట. కానీ ఆ రేంజ్ బాలీవుడ్ హీరోయిన్స్ రాజమౌళి ని భారీ రెమ్యూనరేషన్ అడుగుతున్నారట.

ఇటీవలే పరిణితి చోప్రా అయితే ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట. పరిణితి చెప్పిన ఆ రేట్ విని రాజమౌళి షాక్ అయ్యాడట. ఎందుకంటే తెలుగులో మహా అయితే హీరోయిన్ కి కోటి వరకు ఇస్తారు.

తెలుగు లో అది పెద్ద విషయమేనైనా బాలీవుడ్ లో మాత్రం నాలుగు కోట్లు కామన్. మరి రెమ్యూనరేషన్ విషయంలోనే షాక్ అయిన రాజమౌళి…. ఈ సినిమాలో ఏ హీరోయిన్ ను తీసుకుంటాడో చూడాలి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  8 Feb 2019 3:04 AM GMT
Next Story